Maa Elections : మా అధ్యక్ష ఎన్నిక మరో నెల రోజుల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ నటుడు. వివరాల్లోకి వెళితే.. మా అధ్యక్ష ఎన్నిక నిర్వహించడానికి కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్‌లో ఎన్నికల నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఏకగ్రీవం కావడానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. అంతేకాదు పోటీలో ఉన్న వాళ్లు ఎవరికే వారే తాము గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. పోటీలో ఇంత మంది ఉన్న ముఖ్యమైన పోటీ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కార్యనిర్వాహక సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజుకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు చిరంజీవి కూడా ‘మా’కు త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కోరిన సంగతి తెలిసిందే కదా.
ముఖ్యంగా మంచు విష్ణు మాత్రం తనని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే.. త్వరలో ‘మా’ కు సొంత భవనం నిర్మాణం చేస్తానని హామి ఇచ్చారు. అంతేకాదు ఇప్పటికే మూడు చోట్ల స్థలాలను పరిశీలించినట్టు కూడా చెప్పారు. ఆ సంగతి పక్కన పెడితే.. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు గుట్టుగా సాగిపోయే ‘మా’ కార్యకలాపాలు ఇపుడు రచ్చ కెక్కాయి.
ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా కుటుంబం అంటూ చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వారికున్నాయనే విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది. ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణ వాదంతో జీవీఎల్ నరసింహారావు ’మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేయబోతన్నట్టు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు.
అంతేకాదు అధ్యక్షుడిగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈయన ‘మేము సైతం’ అంటూ ఇండస్ట్రీలోని పేద కళాకారులకు తన చేతనైనా సాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు కిరణ్ మాట్లాడుతూ.. తనకు సినిమాల్లో వచ్చే ఆదాయం తప్ప వేరు ఇతర ఆదాయాలు లేవన్నారు. ఇక మా మాజీ అద్యక్షుడు శివాజీ రాజా తాను బావ మరుదులమన్నారు. తమ మధ్య కొంచెం విభేదాలంటే మంచిదన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తాను తప్పకుండా గెలుస్తానని చెప్పారు. ‘మా’లో మొత్తం 900 వరకు సభ్యులున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగానా.. 450 వరకు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా జరగబోయే ఎన్నికల్లో 450 ఓట్లలో 300 ఓట్లు ఖచ్చితంగా తనకే వేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ విషయాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాత్రం చెప్పడం లేదన్నారు. ఎన్నిక జరిగిన తర్వాత మీరు ఆ విషయం ఒప్పుకుంటారని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలవడం పెద్ద విషయం కాదన్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా.. అందులో 300 ఓట్లు మాత్రం తనకు ఖచ్చితంగా పడతాయనే విషయం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Evaru Meelo Koteeswarulu - Jr NTR : ఎన్టీఆర్ షోలో రానా సాయం తీసుకున్న రామ్ చరణ్..
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GVL Narasimha Rao, Hema, Jeevitha rajasekhar, Kadambari Kiran, MAA Elections, Manchu Vishnu, Prakash Raj