MAA Elections : మా ఫ్యామిలీని లాగోద్దు.. ప్రకాష్ రాజ్‌కు మంచు విష్ణు వార్నింగ్...

Prakash Raj and Manchu Vishnu Photo : Twitter

MAA Elections : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు అక్టోబరు 10న ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ముమ్మురంగా ప్రచారం మొదలు పెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

 • Share this:
  తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. మా ఎన్నికల పోటీలో ఉన్న ఇరు ప్యానల్ వర్గాలు ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎంతలా అంటే జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి. తాజాగా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. మా ఎన్నికల వ్యవహారంలో తన కుటుంబాన్ని లాగొద్దని, మంచు ఫ్యామిలీ అని మాట్లాడోద్దని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో సభ్యులైన జీవిత, శ్రీకాంత్‌లపై కూడా విరుచుకుపడ్డారు విష్ణు.

  ఆయన మాట్లాడుతూ.. 'ప్రకాశ్‌రాజ్‌ గారు.. ఇంకోసారి నా ఫ్యామిలీ పేరు ఇంకోసారి తీస్తే ఇకపై మీకు గారు అని ఇస్తున్న గౌరవం ఉండదు. ఇక్కడ నేను అధ్యక్ష అభ్యర్థిని.. మీకు దమ్ము, సత్తా ఉంటే నా గురించి మాట్లాడండి. మా అక్క, తమ్ముడు, నాన్నను లాగకండి. ప్రతి దానికీ మంచు ఫ్యామిలీ పేరు ఎందుకు తీస్తున్నారు? నా కోసం నా కుటుంబం ఓటు అడిగితే తప్పా. నా కోసం మా నాన్న ఓటు అడగరా? మీ ఫ్యామిలీ లైఫ్ గురించి నేను మాట్లాడలేనా?' అంటూ మండిపడ్డారు మంచు విష్ణు. ఈ మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి.

  Maha Samudram : డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న మహా సముద్రం.. దసరా కానుకగా విడుదల..

  మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారని తెలిపారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు. వీటితో పాటు అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.

  Samantha : విడాకుల తర్వాత సమంత అప్పుడే సొంత కుంపటి.. వైరల్ అవుతోన్న న్యూస్..

  ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
  Published by:Suresh Rachamalla
  First published: