MAA Elections - Manchu Vishnu: ‘మా’ (Movie Artists Association) మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌గా నూతంగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ‘మా’కు సంబంధించిన విషయాలపై దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించిన రోజునే.. సీనియర్ నటులకు పెన్షన్ పథకంపై తొలి సంతకం చేశారు. అయితే.. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మంచు విష్ణు .. ‘మా’ నిబంధనల్లు పలు మార్పులు చేర్పులు చేస్తానంటున్నారు. అంతేకాదు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇటు టాలీవుడ్ సీనియర్ నటీనటులతో పాటు రాజకీయ నాయకులను వరుసగా కలుస్తున్నారు. అంతేకాదు ఈ సోమవారం తన టీమ్ మెంటర్స్‌తో కలిసి తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే.. తిరుపతి వస్తానని మొక్కుకున్నారు. అందుకే తన టీమ్ మెంబర్స్‌తో కలిసి మొక్కులు చెల్లించుకున్నట్టు వెల్లడించారు.
అంతేకాదు ‘మా’ బైలాస్’లో పలు మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు. ఎవరు పడితే.. వారు ‘మా’ సభ్యత్వం ఇవ్వకూడదనే నిర్ణయం ఇందులో తీసుకోనున్నారు. మరోవైపు పోటీ చేసే అభ్యర్ధులు తెలుగు వాళ్లు ఉండేలా ఇందులో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత చిత్తూరులోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను సందర్శించారు. అంతేకాదు అక్కడ ’మా’కు ఎన్నికైన మంచు విష్ణుతో పాటు మిగతా సభ్యులను స్కూల్ ప్రతినిధులు సత్కరించారు.
Venkatesh Multistarers : అబ్బాయి రానాతో కాకుండా.. మరో క్రేజీ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..
ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా త్వరలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా టిక్కెట్ రేట్స్ విషయంలో మరోసారి ప్రభుత్వాన్ని కలవనున్నట్టు చెప్పారు.
NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..
అంతేకాదు ‘మా’కు హైదరాబాద్‌తో పాటు ఏపీలో భవనం ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రిని కలిసి సరైన స్థలం ఇస్తే తమ నిధుల నుంచి ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ కూడా భవన నిర్మాణం చేపడతామన్నారు.
Chiranjeevi Dual Roles: చిరంజీవి ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారా.. తెలుసా..
అంతేకాదు పవన్ కళ్యాణ్ తనను చూసి ముఖం చాటేసారనే విషయమై మాట్లాడుతూ.. మేమిద్దరం అంతకు ముందే మాట్లాడుకున్నామన్నారు. అక్కడ మన దేశ ఉప రాష్ట్రపతి ఉపస్థితులు కావడంతో స్టేజ్ పై మాట్లాడుకునే పరిస్థితి లేదంటూ క్లారిటీ ఇచ్చారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మరోవైపు చిరంజీవితో నాన్న (మోహన్ బాబు) ఇద్దరు మంచి మిత్రులన్నారు.
ఇక ఏపీ సీఎంను కలిసిన తర్వాత .. తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నట్టు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. ’మా’ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA Building, MAA Elections, Manchu Vishnu, Tollywood