Maa Elections - Manchu Vishnu: ‘మా’ సొంత భవనం కల త్వరలో నెరవేరనుంది.. మూడు స్థలాలు చూసానంటూ మంచు విష్ణు వీడియో వైరల్..

మంచు విష్ణు (File/Photo)

Maa Elections - Manchu Vishnu:  ‘మా’ సొంత భవనం కల త్వరలో నెరవేరనుంది.. మూడు స్థలాలు చూసానంటూ మంచు విష్ణు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Maa Elections - Manchu Vishnu:  ‘మా’ సొంత భవనం కల త్వరలో నెరవేరనుంది.. మూడు స్థలాలు చూసానంటూ మంచు విష్ణు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వివరాల్లోకి వెళితే..  గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఒకప్పుడు గుట్టుగా సాగిపోయే ‘మా’ కార్యకలాపాలు ఇపుడు రచ్చ కెక్కాయి. ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా కుటుంబం అంటూ  చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వారికున్నాయనే  విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది.  ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణ వాదంతో జీవీఎల్ నరసింహారావు ’మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే కదా.

    ‘మా’ అధ్యక్షకుడిగా ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను తప్పుకుంటానని మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మంచు విష్ణు ఓ వీడియో షేర్ చేసారు. ‘మా’కు శాశ్వత భవనం ఉండాలనేది ’మా’ అసోసియేషన్‌లోకి ప్రతి ఒక్కరి కోరిక. ఇప్పటికే ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించాన్నారు. అంతేకాదు అసోసియేషన్ మెంబర్స్‌తో మాట్లాడి  అందరి అభిప్రాయం తెలుసుకొని  అది ఎక్కడ కట్టాలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాజాగా మంచు విష్ణు షేర్ చేసిన ఈ వీడియోతో మరోసారి ‘మా’ ఎన్నికలను మంచు విష్ణు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు స్ఫష్టమైంది.



    మా’కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరి కల అని.. అది త్వరలో నిజం కానుందని ఆయన అన్నారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించానని.. వాటిల్లో ఎక్కడ నిర్మించాలనే దానిపై త్వరలోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంచు విష్ణు షేర్‌ చేసిన వీడియోతో అందరి దృష్టి మరోసారి ‘మా’ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందకు ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో అందరి అజెండా మాత్రం ‘మా’కు శాశ్వత భవనం నిర్మంచడం..  అంతేకాదు ‘మా’ సభ్యల అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ప్రకటించారు. వీరిలో ఎవరు ‘మా’ అధ్యక్షులుగా ఎన్నికవుతారనేది చూడాలి.

    ఇవి కూడా చదవండి.. 

    ’శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సినీ ఎంట్రీ..

    ’ఆహా’ కొత్త ఆఫీసులో సందడి చేసిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ..

    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    HBD Raadhika : హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ గురించి ఈ విషయాలు తెలుసా..


    Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..


    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published: