Maa Elections - Manchu Vishnu : తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు కొత్త మలుపు తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి ‘మా’కు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించి సంగతి తెలిసిందే కదా. రీసెంట్గా మంచు విష్ణు తన ప్యానల్ సభ్యుల జాబితాను విడుదల చేసారు. ఈ సందర్భంగా తన ప్యానెల్ సభ్యులతో మంచు విష్ణు తొలిసారి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ అసోసియేషన్ ప్రారంభై 25 యేళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో తెలుగులో చాలా మంది కళాకారులకు తమిళనాడు అన్నం పెట్టింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. అపుడున్నతెలుగుతో పాటు కన్నడ, మలయాళ చలన చిత్ర పరిశ్రమలకు తమిళనాడులోని చెన్నై కేంద్ర స్థానంగా ఉండేది. ఆ తర్వాత క్రమక్రమంగా ఏ భాషకు చెందిన చిత్ర పరిశ్రమ ఆయా రాష్ట్రాల్లోనే వేళ్లూనుకుంది. ఇప్పటికే వివిధ భాషల చిత్రాలు చెన్నైలో చిత్రీకరణ జరుగుతున్నాయనే విషయాన్ని ప్రస్తావించారు.
Prema Nagar@50Years : అక్కినేని, వాణిశ్రీల ‘ప్రేమనగర్’కు 50 యేళ్లు పూర్తి.. తెర వెనక కథ..
చెన్నై నుంచి హైదరాబాద్ కు షిప్ట్ అయిన తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ కంటూ ఒక సంఘం ఉండాలని ‘మా’ ను ఏర్పాటు చేసుకున్నాయి. ఎంతో మంది నటీనటులు ఈ సంఘం కోసం పాటుపడ్డ విషయాన్ని మంచు విష్ణు ప్రస్తావించారు. తెరపై చూసినట్టు సినిమా నటులు ఖరీదైన జీవితం గడుపుతూ ఉంటారని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ మేకప్ తీసి ఇంటికి వచ్చిన తర్వాత మేము మాములుగానే జీవిస్తామన్నారు.
Love Story Movie Review : నాగ చైతన్య, సాయి పల్లవిల ’లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ.. ఎమోషనల్ లవ్ డ్రామా..
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఒక నటుడికి యేడాది మొత్తం పని ఉండొచ్చు. ఆ తర్వాత ఇయర్ మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి రావొచ్చు. ఓ నటుడి కష్టాలు, బాధలు అతడికే తెలుస్తుందన్నారు. ఆ బాధను కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేరన్నారు. ఆర్టిస్టుల కోసం, మా అందరి కోసమే ‘మా’ సంఘం ఉంది. మా అధ్యక్షుడు అనేది ఒక పదవి కాదు. ఓ బాధ్యత.
Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..
దాన్ని సమర్ధవంతంగా నిర్వహించగలననే నమ్మకంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికలు ఈ రకంగా జరగడం నాతో పాటు చాలా మందికి ఇష్టం లేదన్నారు. ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం నాన్న మోహన్ బాబుకు ఇష్టం లేదన్నారు. ఇన్నేళ్లలో మా ఎన్నికలు ఈ స్థాయిలో బీభత్సంగా జరగలేదనే విషయాన్ని మంచు విష్ణు ప్రస్తావించారు.
2015 - 16లో స్వర్గీయ దాసరి నారాయణ రావు, మురళీమోహన్ గారు నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమన్నారు. ఆ సమయంలో నాన్నగారైన మోహన్ బాబు ఆ పదవి బాధ్యతతో కూడుకున్నది. అనుభవం సరిపోదంటూ పోటీ చేయెద్దని చెప్పడంతో అపుడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు చెప్పారు. ఇపుడు మాత్రం ‘మా’లో మార్పు తీసుకురాగలననే నమ్మకంతో ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మా సభ్యులందరికి మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకురాబోతున్నట్టు చెప్పారు.
NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..
మా సభ్యులైన 900 మందిని 2000 వరకు తీసుకురావాలన్నది తన తపన అన్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనేది తన పాలసీ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవుడితో సమానం. వాళ్లకు గౌరవం ఇచ్చినపుడే మనం మనగలం అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ఓ నిర్మాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసారు. దాన్ని మనం చూసి గర్వించాలన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నందున మా నాన్న గారు స్వయంగా 600 మందికి ఫోన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతే తప్పించి మా నాన్న నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదన్నారు.
Vekantesh Remakes: దృశ్యం 2 సహా వెంకటేష్ తన కెరీర్లో రీమేక్ చేసిన ఈ సినిమా గురించి తెలుసా..
మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ ను ఇదివరకే ప్రకటించగా.. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి, పృధ్విరాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీస్ గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన,వడ్లపట్ల పేర్లను ప్రకటించని సంగతి తెలిసిందే కదా. ఇక ఈ మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA Elections, Manchu Vishnu, Tollywood