Maa Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ముసలం.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు 15 మంది లేఖ..

కృష్ణంరాజు (File/Photo)

Maa Elections:  గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్‌లోని కొంత మంది ఈసీ సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైన కృష్ణంరాజుకు లేఖ రాయడం కలకలం రేపుతోంది.

 • Share this:
  Maa Elections:  గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. Maa Elections:  గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఒకప్పుడు గుట్టుగా సాగిపోయే ‘మా’ కార్యకలాపాలు ఇపుడు రచ్చ కెక్కాయి. ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా కుటుంబం అంటూ  చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వారికున్నాయనే  విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది.  ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణ వాదంతో జీవీఎల్ నరసింహారావు ’మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే కదా.

  రీసెంట్‌గా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దలు ఎవరినైనా ‘మా’ అధ్యక్షడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను బరిలో నుంచి పక్కకు తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో  మా’ అధ్యక్షుడుగా నందమూరి బాలకృష్ణ ఎన్నికైతే తాను ఎంతో సంతోషిస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా ‘మా’ ఎన్నికల వ్యవహారం కొత్త టర్న్ తీసుకొంది. ఇపుడున్న కార్యనిర్వాహక కమిటీకి టైమ్ అయిపోయింది కాబట్టి.. వెంటనే ‘మా’ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని 15 మంది సభ్యులు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాసినట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారనే దానిపై ప్రస్తతానకీ పేర్లు మాత్రం బయటకు రాలేదు.

  maa elections,maa elections murali mohan comments,maa president elections,maa president prakash raj,maa president manchu vishnu,maa president jeevitha rajasekhar,telugu cinema,ప్రకాశ్ రాజ్ మా ప్రెసిడెంట్,మంచు విష్ణు మా ప్రెసిడెంట్,జీవిత రాజశేఖర్ మా ప్రెసిడెంట్,మా ఎన్నికలపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు
  ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు (‘Twitter/Photo)


  ఈ లేఖలో మేమందరం 2019 మార్చిలో ఎన్నికయ్యాము. మా పదవీ కాలం 2021 మార్చితో పూర్తైయింది. అయితే.. కరోనా కారణంగా ఈ మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ‘మా’ ఒక ఎన్నికైన కార్యవర్గం అంటూ లేకుండా పోయిందని ఈ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాదు ఎన్నికైన కార్యవర్గమని ఇపుడున్నవారు చెప్పుకోవడానికి ఎలాంటి నైతిక హక్కు లేదున్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా.. సీనియర్ సభ్యుడిగా మీరు పగ్గాలు చేపడితే బాగుంటుందని కోరారు. అంతేకాదు ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అంతేకాదు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో మేము పూర్తిగా సహకరిస్తామని ఈ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

  Maa Elections : ప్రకాష్ రాజ్ ప్యానల్ Photo : Twitter


  ఇక ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ గురువారం సాయంత్రి జరగనుంది. సాధారణంగా ఈ కమిటీకి ‘మా’ అధ్యక్షుడైన నరేష్ నాయకత్వం వహించాలి. కానీ ఈ సమావేశానికి మా అధ్యక్షుడు నరేష్‌కు బదులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైన  కృష్ణంరాజు నేతృత్వం వహించబోతున్నట్టు సమాచారం. ఈ మీటింగ్‌లో ‘మా’ ఎన్నికల నిర్వహణతో పాటు కొన్ని ముఖ్యమైన  అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ జరిగే ముందు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైన కృష్ణంరాజుకు ఈసీ సభ్యులు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ లేఖలపై కృష్ణంరాజు .. ‘మా’ అధ్యక్షుడితో పాటు క్రమశిక్షణ సంఘం సభ్యుల అభిప్రాయం కోరే అవకాశం ఉంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న పిదప కృష్ణంరాజు ‘మా’ ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: