Home /News /movies /

MAA ELECTIONS BANDLA GANESH WITH DRAW MAA GENERAL SECRETARY NOMINATIONS TA

Bandla Ganesh : బండ్ల గణేష్ వెనకడుగు.. వారి సూచనతో మా జనరల్ సెక్రటరీ నామినేషన్ ఉపసంహరణ..

‘మా’ జనరల్ సెక్రటరీ పదని నుంచి తప్పుకున్న బండ్ల గణేష్ (Twitter/Photo)

‘మా’ జనరల్ సెక్రటరీ పదని నుంచి తప్పుకున్న బండ్ల గణేష్ (Twitter/Photo)

Bandla Ganesh - MAA Elections : తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బండ్ల గణేష్ తెలియజేసారు.

    Bandla Ganesh - MAA Elections : తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికలకు పట్టుమని పదిరోజులు కూడా లేవు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఎవరికి వారు మా సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే మంచు విష్ణుతో పాటు, ప్రకాష్ రాజ్ నామినేషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక మంచు విష్ణు ప్యానెల్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, సీనియర్ హీరో బాలకృష్ణ వంటి హీరోల మద్ధతు ఉందనే ప్రచారం జరుగుతోంది. అటు ప్రకాష్ రాజ్‌కు మెగా హీరోల మద్దతు ఉండనే ఉంది. మరోవైపు సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరు మంచు విష్ణుకు సపోర్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్‌బాబుకు పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం.

    ఇప్పటికే బరిలో ఉన్న వీళ్లిద్దరు ఎవరికి వారే తమ మ్యానిఫేస్టోలను ప్రకటించారు. ఇక సీవీఎల్ నరసింహారావు ఇండిపెండెంట్‌గా తెలంగాణ వాదంతో బరిలో దిగిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరి పదవికి ప్రముఖ కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్ స్వతంత్య్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసారు.



    తాజాగా ఈయన ప్రకాష్ రాజ్, శ్రీకాంత్‌తో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్రముఖుల సూచనల మేరకు ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. మొత్తంగా ప్రకాష్ రాజ్ తమ ప్యానెల్‌‌కు వ్యతిరేకంగా పోటీలో నిలబడ్డ బండ్ల గణేష్ నామినేషన్ ఉపసహరించుకునేలా చేయడంలో మొదటి విజయం అందుకున్నారు.

    Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

    మా ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ ముందుగా అధ్యక్షురాలిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని  ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో జాయిన్ అయింది. ఆ తరవాాత ఆమెకు  జనరల్ సెక్రటరీగా పోటీకి దింపారు ప్రకాష్ రాజ్ ప్యానెల్. ఈ నేపథ్యంలో  బండ్ల గణేష్ .. తాను పోటీ చేయాలనుకున్న జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్ పోటీ చేస్తూ ఉండటంతో  బండ్ల గణేష్.. స్వతంత్య్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా.

    James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

    అంతేకాదు అప్పట్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌పై  గెలుస్తానని సవాలు విసిరాడు బండ్ల గణేష్. అప్పటి వరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేష్.. జీవిత వచ్చిన తర్వాత రూటు మార్చారు. తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి పెద్దల సలహాతో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bandla Ganesh, Prakash Raj, Srikanth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు