MAA ELECTIONS ACTRESS PRAGATHI LOSES HER COOL SERIOUS ON ACTOR MANIK SU
Actress Pragathi: మా ఎన్నికలు.. సహనం కోల్పోయిన నటి ప్రగతి.. అతడిపైకి ఆవేశంగా..
పోలింగ్ కేంద్రంలో నటి ప్రగతి
మా ఎన్నికల పోలింగ్ సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల (MAA Elections 2021) పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సారి మా ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైంది. మొత్తం 925మంది మా సభ్యులు ఉండగా, అందులో 883మందికి ఓటు హక్కు ఉంది. వారిలో ఈసారి 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసేందుకు నటీనటులు క్యూకట్టారు. ఐతే పోలింగ్ సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో.. ఓ దశలో నటి ప్రగతి (Actress Pragathi) సహనం కోల్పోయారు. అసలేం జరిగిందే.. మంచు విష్ణు ప్యానల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేస్తున్న ఈసీ మెంబర్ మాణిక్‌ను ప్రకాశ్‌రాజ్ ప్యానల్ అడ్డుకుంది. పోలింగ్ బూత్‌లో చిట్టీలు పంచుతున్నారని ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. అదే సమయంలో ఆవేశంగా అక్కడికి చేరుకున్న నటి ప్రగతి ఆవేశంతో అతనిపై సీరియస్ అయింది.
ప్లీజ్.. లీవ్ దిస్ ప్లేస్(ఇక్కడి నుంచి వెళ్లిపో) అంటూ గట్టిగా అరిచింది. చేయి చూపించి వెళ్లిపోవాలని కోరింది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన మంచు విష్ణు.. మాణిక్‌ను పక్కకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సాధారణంగా చాలా శాంతంగా కనిపించే ప్రగతి అలా కోపంతో ఊగిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక, ప్రగతి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
శివ బాలాజీ చేయి కొరికిన హేమ..
పోలింగ్ సమయంలో విష్ణు ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోపంతో శివబాలాజీ చేతిని హేమ కొరికారు. శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని హేమ చెప్పారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో చేయి కొరకాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అంతేతప్ప దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు.
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
గతంలో లేని విధంగా ఈసారి మా సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని గంట సేపు పొడిగించారు. ఇక, పోలింగ్ ముగియడంతో.. అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోలైన ఓట్లకు బ్యాలెట్ బ్యాక్సులను లెక్కింపు వేదిక వద్దకు తీసుకొచ్చారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కేవలం ప్యానెల్ సభ్యులకు మాత్రమే ఓట్ల లెక్కింపు వేదిక వద్దకు అనుమతి ఇచ్చారు. కౌంటింగ్ కోసం ఆరు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై ఇద్దరికి అనుమతి ఇచ్చారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.