హోమ్ /వార్తలు /సినిమా /

Maa Elections - Prudhvi Vs Jeevitha : మా ఎన్నికల నేపథ్యంలో జీవిత రాజశేఖర్ పై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన ఆరోపణలు..

Maa Elections - Prudhvi Vs Jeevitha : మా ఎన్నికల నేపథ్యంలో జీవిత రాజశేఖర్ పై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన ఆరోపణలు..

జీవిత రాజశేఖర్ పై 30 ఇయర్స్ పృథ్వీ (Twitter/Photo)

జీవిత రాజశేఖర్ పై 30 ఇయర్స్ పృథ్వీ (Twitter/Photo)

Maa Elections : మా ఎన్నికల నేపథ్యంలో  జీవిత రాజశేఖర్ పై విష్ణు ప్యానెల్ సభ్యుడైన 30 ఇయర్స్ పృథ్వీ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Maa Elections : మా ఎన్నికల నేపథ్యంలో  జీవిత రాజశేఖర్ పై విష్ణు ప్యానెల్ సభ్యుడైన 30 ఇయర్స్ పృథ్వీ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు (Movie Artists Association) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.  అధ్యక్ష బరిలో నిలిచేవాళ్లు ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ’మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు హేమా (Hema), జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar),సీవీఎల్ నరసింహారావు (CVL Narasimha Rao) పోటీలో ఉన్నారు. చివరకు నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) కూడా ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక జీవిత, హేమా ఇద్దరు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో చేరి పెద్ద షాక్ ఇచ్చారు. వచ్చే నెల 10వ తేదిన ‘మా’ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ సభ్యుల జాబితాను విడుదల చేశారు. మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్‌ను ఇదివరకే ప్రకటించారు.  ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి, పృధ్విరాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీస్ గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన,వడ్లపట్ల పేర్లను ప్రకటించారు.

బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

తాజాగా వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తోన్న 30 ఇయర్స్  పృథ్వీ రాజ్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలైన జీవిత రాజశేఖర్ పై ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బండ్ల గణేష్ బయటకు రావడమే కాక ప్రకాష్ రాజ్ పై కొన్ని ఆరోపణలు చేసారు. తాజాగా పృథ్వీరాజ్.. జీవిత రాజశేఖర్ పై మాట్లాడుతూ.. ఈమె ఓటర్లను ప్రభావితం చేసేలా చేస్తున్నారని చెప్పారు.

Directors Cum Actors : రాజమౌళి, రాఘవేంద్రరావు సహా నటులుగా సత్తా చూపెట్టిన దర్శకులు వీళ్లే..

అంతేకాదు మా తాత్కాలిక సభ్యులను ఆమె ప్రలోభ పెడుతున్నట్టు చెప్పారు.  ఆమె పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరారు పృథ్వీ. మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన కాసేటి క్రితమే పృథ్వీరాజ్ జీవిత రాజశేఖర్ పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఇద్దరు విందు రాజకీయాలకు తెరతీసిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: 30 Years Prudhvi Raj, Jeevitha rajasekhar, MAA Elections, Manchu Vishnu, Prakash Raj

ఉత్తమ కథలు