MAA Elections - Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు.. నీ పెత్తనం ఏంటి అంటూ..!

ప్రకాశ్ రాజ్ (Prakash Raj)

MAA Elections - Prakash Raj: తెలుగు ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు(MAA Elections - Prakash Raj) ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్ పోటీలో ఉన్నాడు. కానీ ఈయనకు వ్యతిరేకంగా తాజాగా హిందూ సంఘలు వచ్చాయి.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ప్రత్యేకమైన గౌరవం ఉంది. వాళ్లేం చేసినా కూడా ఇండస్ట్రీలోని పేద కళాకారుల కోసమే చేస్తారంటూ మంచి గుర్తింపు ఉంది. అయితే ఇదంతా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా తాము మంచి పనులే చేస్తున్నామంటూ చెప్పుకుంటున్నారు కానీ వాళ్లు చేసే మంచి కంటే కూడా రచ్చ బయటికి ఎక్కువగా కనిపిస్తుంది. పైగా మీడియా ఫోకస్ అంతా వాళ్లపైనే ఉంటుంది.. అలా ఉండేలా చేసుకుంటున్నారు వాళ్లు. అందుకే గోప్యంగా జరగాల్సిన మా ఎన్నికలు ఈ రోజు రచ్చ రచ్చ అవుతున్నాయి. గత రెండు పర్యాయాలుగా అక్కడ జరుగుతున్న రచ్చ చూసి నిజమైన ఎన్నికలు కూడా ఈ స్థాయిలో జరగవు కదరా నాయనా.. 900 మంది కూడా లేని యూనిట్ కోసం ఇంత రచ్చ అవసరమా అంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్ పోటీలో ఉన్నాడు. ఈయనతో పాటు మంచు వారబ్బాయి విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ, సీనియర్ నటుడు సివిఎల్ నరసింహారావు కూడా పోటీలో ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా తాజాగా హిందూ సంఘలు వచ్చాయి.

నటుడిగా ఆయన్ని గౌరవిస్తాం.. అభిమానిస్తాం కానీ పెత్తనం చెలాయిస్తానంటే మాత్రం ఒప్పుకోం అంటూ కొత్త పాట అందుకున్నాయి. ఈయన మా అధ్యక్షుడు అయితే కచ్చితంగా హిందూ కళాకారులకు అన్యాయం జరుగుతుందని.. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పోరాడాలని హిందూ సంఘాలు కోరుకుంటున్నాయి. గతంలో హిందువులను కాకులతో పోల్చాడు ప్రకాశ్ రాజ్.
prakash raj,prakash raj twitter,prakash raj instagram,prakash raj hindu sanghalu,prakash raj MAA elections 2021,prakash raj MAA contest chiranjeevi support,prakash raj chiranjeevi support,ప్రకాశ్ రాజ్,ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు,ప్రకాశ్ రాజ్ మా అసోసియేషన్ ఎన్నికలు,చిరంజీవి మా అసోసియేషన్ చిరంజీవి మద్దతు
ప్రకాశ్ రాజ్ (Prakash Raj)

అందుకే ఇప్పుడు ఆయనకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరు కాకులుగా ఒప్పుకున్నట్లే.. ‘మా’ లో కాకులు లేవనే భావిస్తున్నామని హిందూ సంఘాల నాయకుడు దుర్గా శ్రీరామ్ తెలిపారు. ప్రకాష్ రాజ్‌కు తన సొంతం రాష్ట్రంలోనే ప్రజలు తిరస్కరించారు.. అందుకే ఇక్కడ ఆయనకు మద్దతుగా నిలిచిన వాళ్లు ఒక్కసారి ఆలోచించుకోవాలని.. అలాంటి హిందూ వ్యతిరేకికి అధికార పగ్గాలు ఇవ్వరాదని వాళ్లు కాస్త బలంగానే ఫైట్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: