Mohan Babu: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. రెచ్చగొట్టింది చాలు.. తగ్గించుకుంటే మంచిది

మోహన్ బాబు

Mohan Babu: మీకు ఏవైనా సమస్యలుంటే తమకు చెప్పాలని, అంతేతప్ప రోడ్డు మీదకు వెళ్లి టీవీలకు ఎక్కి ఆందోళనలు చేయకండని కళాకారులకు సూచించారు మోహన్ బాబు. వినోదం నటనలో ఉండాలి అంతేతప్ప దుర్భాషలాడడంలో ఉండకూడదని హితవు పలికారు.

 • Share this:
  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ముగిసినా.. టాలీవుడ్‌ (Tollywood)లో ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా మోహన్ బాబు (Mohan Babu) సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికల్లో చాలా మంది చాలా రాజకీయాలు చేశారని ప్రకాశ్ రాజ్‌ (Prakash Raj) ప్యానెల్‌, వారికి మద్దతు ఇచ్చిన పెద్దలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాము ఎక్కువ మందిమి ఉన్నామంటూ బెదిరించారని, కానీ సభ్యులెవరూ భయపడకుండా మంచు విష్ణుకు ఓట్లు వేశారని తెలిపారు. ఇండస్ట్రీలో ఒకరి దయాదాక్షిణ్యాల మీద అవకాశాలు రావని, ప్రతిభ ఉంటే అవకాశాలు అవే వస్తాయని స్పష్టం చేశారు. ఇక నుంచైనా టీవీలకు రావడం మానేయాలని.. మనుషులను రెచ్చగొట్టవద్దని విమర్శించారు. అదే పనిగా రెచ్చగొడుతూ ఉంటే ఎంతటి చిన్నవాడికైనా ఆగ్రహం వస్తుందని స్పష్టం చేశారు. గొడవలను వదిలేసి, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని మా అసోసియేషన్ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మోహన్ బాబు.

  చప్పగా బిగ్‌బాస్ షో.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది...

  ''ఇది రాజకీయ వేదిక కాదు. కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. కొందరు రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఇక్కడ అందరం కళామ తల్లి బిడ్డలం. మా ఎన్నికల్లో ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఇదంతా అవసరమా? సినిమాల్లో జయాపజయాలు సర్వసాధారణం. ఎంత కష్టపడినా కొందరికి సక్సెస్ రాకపోవచ్చు. కానీ కొందరు విర్రవీగుతారు. కానీ ఎప్పుడో ఓసారి దిమ్మతిరిగేలా పడిపోతారు. ఇది తెలుసుకోండా.. కొందరు మేం ఇంత మంది ఉన్నాం? మేం అంత మంది ఉన్నామని చాలా మంది బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు కళాకారులెవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నచ్చిన వారికి ఓటువేశారు. సినిమా ఇండస్ట్రీలో ఒకరి దయాదాక్షిణ్యాలు ఉండవు. ప్రతిభ, క్రమశిక్షణ ఉంటే అవకాశాలు అవే వస్తాయి. ఎవ్వరికీ భయపడకుండా మీరు విష్ణును గెలిపించినందుకు సంతోషంగా ఉంది.'' అని మోహన్ బాబు అన్నారు.

  రానాకు షాక్ ఇచ్చిన శేఖర్ కమ్ముల... స్టార్ హీరోతో లీడర్‌ సీక్వెల్‌కు ప్లాన్..

  ''నాకు పగ, రాగద్వేషాలు లేవు. అవసరం లేదు. నా హృదయంలో ఏదీ దాచుకోను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. నా కోపంతో నేనే నష్టపోయాను తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు. కళాకారులంతా ఒక్కటిగా ఉండాలి. ఇక చాలు. మనిషిని రెచ్చగొట్టవద్దు. రెచ్చగొడుగూ రెచ్చగొడుతూ ఉంటే ఎంతటి చిన్నవాడైనా రెచ్చిపోతారు. అందరం కలిసి కట్టుగా ఉందాం. ఐ లవ్ యూ ఆల్. ఓటు వేయని వారిపై కక్ష, పగ వద్దు. అందరూ కలిసి మెలిసి ఉందాం. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. మంచి హీరో. మంచి నటుడు. ఇంత చిన్న వయసులో మా అధ్యక్షుడయ్యారు. భారత దేశం గర్వించేలా మాకు పేరు తీసుకురావాలి. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తాం. నేనే స్వయంగా వెళ్లే కలుస్తా. ఆయన కళాకారులకు న్యాయం చేస్తారు. త్వరలోనే ఏపీకి కూడా వెళ్లి మంత్రిని కలుస్తాం.'' అని మోహన్ బాబు పేర్కొన్నారు.

  అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... అనుకున్న సమయం కంటే ముందే...

  మీకు ఏవైనా సమస్యలుంటే తమకు చెప్పాలని, అంతేతప్ప రోడ్డు మీదకు వెళ్లి టీవీలకు ఎక్కి ఆందోళనలు చేయకండని కళాకారులకు సూచించారు మోహన్ బాబు. వినోదం నటనలో ఉండాలి అంతేతప్ప దుర్భాషలాడడంలో ఉండకూడదని హితవు పలికారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ బాబు, కృష్ణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐతే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్లు మాత్రం దూరంగా ఉన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: