Home /News /movies /

MAA Elections: మగవారి ఏడుపును నమ్మవద్దు.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై నరేష్ సంచలన వ్యాఖ్యలు

MAA Elections: మగవారి ఏడుపును నమ్మవద్దు.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై నరేష్ సంచలన వ్యాఖ్యలు

నరేష్, ప్రకాశ్ రాజ్

నరేష్, ప్రకాశ్ రాజ్

MAA Elections 2021: నిన్న ప్రకాశ్ రాజ్ వర్గం చేసిన ఆరోపణలకు.. నేడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన వారిపై తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మగవారి ఏడుపును నమ్మకూడదని మండిపడ్డారు.

    ఎన్నికల ముందు రచ్చ. పోలింగ్ సమయంలోనూ గొడవ. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అదే స్థాయిలో రభస. మా అసోసియేషన్‌లో నటీ నటుల లొల్లి రోజు రోజుకూ ముదురుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ వర్గం నటులు... మోహన్ బాబు, నరేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలింగ్ రోజున బెనర్జీ, తనీష్‌ను మోహన్ బాబు దుర్భాషలాడాడనని ఆరోపించారు. వారు స్వేచ్ఛగా పనిచేసుకోవాలని, తాము అడ్డుపడే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే నిన్న ప్రకాశ్ రాజ్ వర్గం చేసిన ఆరోపణలకు.. నేడు నరేష్ కౌంటర్ ఇచ్చారు.  ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన వారిపై తనదైన శైలిలో  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా.. మంచు విష్ణు ముందున్న 3 ఆప్షన్స్ ఇవే

    ''మంచు విష్ణు హీరో. నేను హీరో. మోహన్ బాబు పెద్ద. అందుకే మా చుట్టూ తిరుగుతున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయి. నన్ను చూస్తే ప్రకాశ్ రాజ్‌కు హడల్. తప్పుడు జరగనివ్వడు అని భయం. విష్ణు చక్రాన్ని ప్యాంట్‌లో పెట్టుకుంటే ప్యాంట్ చిరిగిపోతుంది. మా ఒక సేవా సంస్థ. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అందు కలిసి కట్టుగా పనిచేద్దాం రండి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆరోపణలెందుకు? ముండమోసిన వారిలా ఏడుపులెందుకు? అతిగా ఏడిచే మగవాళ్లను నమ్మవద్దు. మాలో పెత్తందారీ వ్యవస్థ పోవాలి. ఏం ప్రశ్నిస్తారో ప్రశ్నించండి. మాలో ఎన్నికలే ఉండకూడదు. ఇక నుంచి ఏకగ్రీవాలే జరగాలి.'' అని నరేష్ అన్నారు.

    Manchu Vishnu : ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం

    ''ఎన్నికల కేంద్రంలో కెమెరాలున్నాయి. మోహన్ బాబు బండ బూతులు తిడితే రికార్డవుతుంది. సాక్ష్యం ఉంటే చూపించండి. ఇంకా వాళ్లే మా వాళ్లని కొరికారు. అది మీడియాలో కూడా వచ్చింది. ఎన్నికలల్లో కొరడం ఎక్కడైనా చూశామా? రిగ్గింగ్ చేసి పారిపోతుంటే పట్టుకున్నాం. కొట్టకుండా వదిలేశాం. ఇవన్నీ ఆ రోజు జరిగాయి. మేం బండ బూతులు తిట్టి ఉంటే.. వాటిని నిరూపించండి. ఏమీ లేదు. వాళ్లే మమ్మల్ని రెచ్చగొట్టారు. అలాంటి సంస్కారం మాకు లేదు. '' అని నరేష్ పేర్కొన్నారు.

    MAA Elections 2021: మా ఎన్నికల్లో రియల్ హీరో అతడే.. ఆ ఒక్కడు లేకపోతే

    ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామాలు చేయడంతో.. మా అధ్యక్షుడిగా నెక్ట్స్ మంచు విష్ణు ఏం చేయబోతున్నాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాజీనామాలు ఆమోదించకుండా వారితో చర్చలు జరిపే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  తన ప్యానెల్‌ తరపున పోటీచేసి ఓడిపోయిన వారిని.. తనకున్న అధికారాలతో నేరుగా నామినేట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. నేడు మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు.. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: MAA Elections, Manchu vishu, Naresh, Prakash Raj, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు