Home /News /movies /

MAA ELECTIONS 2021 RESULTS MANCHU VISHNU ELECTED AS MAA PRESIDENT AND SHOCK TO PRAKASH RAJ PK

MAA Elections results: ప్రకాష్ రాజ్‌కు షాక్.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు..

మంచు విష్ణు (Twitter/Photo)

మంచు విష్ణు (Twitter/Photo)

MAA Elections results: ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న సిని‘మా’సమరం (MAA Elections results) ముగింపుదశకు వచ్చేసింది. మా ఎన్నికలు జరిగిన కొన్ని గంటల్లోనే ఫలితాలు కూడా బయటికి వచ్చేసాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు.

ఇంకా చదవండి ...
ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న సిని‘మా’సమరం ముగింపుదశకు వచ్చేసింది. మా ఎన్నికలు జరిగిన కొన్ని గంటల్లోనే ఫలితాలు కూడా బయటికి వచ్చేసాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. చివరి వరకు ప్రకాష్ రాజ్ కూడా పోటీ ఇచ్చినట్లే కనిపించినా కూడా.. చివరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేసాడు. ఈయన వైపే మా సభ్యులు ఎక్కువగా మొగ్గు చూపారు. ప్రకాష్ రాజ్‌ను నటుడిగా ఆదరించినా కూడా.. అధ్యక్షుడిగా మాత్రం చూడలేమని ఓపెన్‌గానే చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇదే నిజమైంది. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే విష్ణు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అది కూడా భారీ మెజార్టీతోనే ఈయన అధ్యక్ష పీఠం సొంతం చేసుకున్నాడు. ఏకంగా 400 ఓట్లకు పైగా మెజారిటీ ఈయనకు వచ్చిందంటే చిన్న విషయం కాదు. పడిన 600 ఓట్లలో 75 శాతం అంటే ముప్పావు భాగం విష్ణు తమకు అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నారు సభ్యులు. అనుకున్నట్లుగానే జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ ఒక్కటి కూడా నిజం చేసి చూపిస్తానంటున్నాడు విష్ణు. గెలిచిన తర్వాత ఆయనపై చాలా బాధ్యత కూడా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero manchu vishnu, MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు