MAA: 'మా'లో మరో రచ్చ.. రంగంలోకి పోలీసులు.. పోలింగ్‌ రోజు సీసీ ఫుటేజీలో ఏముంది?

మా ఎన్నికలు (MAA Elections)

MAA elections: మా ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మా అసోసియేషన్ పోలింగ్ జరిగిన జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సీసీ ఫుటేజీ సర్వర్ రూమ్‌కు తాళం వేశారు.

 • Share this:
  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections) ముగిసి వారం రోజులు గడుస్తున్నా టాలీవుడ్‌ (Tollywod)లో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఎన్నికల్లో మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ అక్రమాలకు పాల్పడిందని, ఎన్నికల అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) వర్గం దుమ్మెత్తిస్తోంది. ఎన్నికల రోజున తమ వర్గం నటులపై మంచు మోహన్ బాబు  (Mohan babu) నరేష్ (Naresh) దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని, ఆ ఫుటేజీని ఇవ్వాలని ఎన్నికల అధికారిని కృష్ణమోహన్‌ను కోరారు. కానీ సీసీ ఫుటేజీ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో మా ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మా అసోసియేషన్ పోలింగ్ జరిగిన జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సీసీ ఫుటేజీ సర్వర్ రూమ్‌కు తాళం వేశారు.

  ఎన్నికల పోలింగ్ రోజున తమ వర్గం నటులుపై విష్ణు వర్గం వారు దాడి చేశారని ప్రకాశ్ రాజ్ ఇటీవలే పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయని, ఐత ఆ సీసీ ఫుటేజ్‌ను మాయం చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జూబ్లిహిల్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్‌ను సీజ్ చేశారు. ఎన్నికల రోజు జరిగి పరిణామాలను ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వర్గం ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, నరేష్ తమ వారిపై దాడి చేశాని ఆరోపించారు. ముఖ్యంగా మోహన్ బాబు బండ బూతులు తిట్టాడని సీనియర్ నటుడు బెనర్జీ, తనీష్ కంట తడిపెట్టుకున్నారు.

  ఆహాలో లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

  కాగా, అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు పోలింగ్ కేంద్రం వద్ద రచ్చరచ్చ జరిగింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌ల మధ్య మీడియా ముందే మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. శివ బాలాజీ చేతిని నటి హేమ కొరికిన దృశ్యాలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఐతే పోలింగ్ కేంద్రంలో ఇంతకు మించిన గొడవ జరిగిందని ప్రకాశ్ రాజ్ వర్గం వారు చెబుతున్నారు. ఆ దృశ్యాలు బయటకు వస్త మోహన్ బాబు, నరేష్ అసలు స్వరూపం బయట పడుతుందని అంటున్నారు. ఆ రోజు పోలింగ్ కేంద్రంలో మంచు మనోజ్ తన తండ్రిని చాలా కంట్రోల్ చేశారని, లేదంటే పరస్పరం కొట్టుకునే వారని నటుడు ప్రభాకర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీ ఫుటేజీని పోలీసులు సీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. నెక్ట్స్ ఏం జరగబోతోందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  నాట్యం ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన రామ్ చరణ్..

  మరోవైపు శనివారం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నటుడు కృష్ణ, మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా' ఎన్నికల్లో చాలా మంది చాలా రాజకీయాలు చేశారని ప్రకాశ్ రాజ్‌ (Prakash Raj) ప్యానెల్‌, వారికి మద్దతు ఇచ్చిన పెద్దలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాము ఎక్కువ మందిమి ఉన్నామంటూ బెదిరించారని, కానీ సభ్యులెవరూ భయపడకుండా మంచు విష్ణుకు ఓట్లు వేశారని తెలిపారు. ఇండస్ట్రీలో ఒకరి దయాదాక్షిణ్యాల మీద అవకాశాలు రావని, ప్రతిభ ఉంటే అవకాశాలు అవే వస్తాయని స్పష్టం చేశారు. ఇక నుంచైనా టీవీలకు రావడం మానేయాలని.. మనుషులను రెచ్చగొట్టవద్దని విమర్శించారు. అదే పనిగా రెచ్చగొడుతూ ఉంటే ఎంతటి చిన్నవాడికైనా ఆగ్రహం వస్తుందని స్పష్టం చేశారు. గొడవలను వదిలేసి, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని మా అసోసియేషన్ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మోహన్ బాబు.
  Published by:Shiva Kumar Addula
  First published: