Maa Elections 2021: మా ఎన్నికల్లో చివరికి చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు జరగనుందా..?

చిరంజీవి మోహన్ బాబు

Chiranjeevi Vs Mohan Babu: తెలుగు ఇండస్ట్రీలో టామ్ అండ్ జెర్రీ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పరిచయం ఉన్న వాళ్లెవ్వరైనా కూడా మరో మాట లేకుండా చిరంజీవి, మోహన్ బాబు(Chiranjeevi Vs Mohan Babu) అని చెప్తుంటారు. వీళ్ళిద్దరి మధ్య మా అసోసియేషన్ ఎన్నికలు మరోసారి చిచ్చు పెట్టేలా కనిపిస్తుంది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో టామ్ అండ్ జెర్రీ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పరిచయం ఉన్న వాళ్లెవ్వరైనా కూడా మరో మాట లేకుండా చిరంజీవి, మోహన్ బాబు అని చెప్తుంటారు. అది వాళ్ల బంధం కూడా. మీడియా ముందు కొట్లాడుకున్నా.. తిట్టుకున్నా కూడా తర్వాత మళ్లీ అంతా సరదగా తీసుకుంటారు. మా రెండు కుటుంబాలు ఒక్కటే అంటారు. అలాగే ఉంటారు కూడా. అంతా బాగానే ఉంది.. ఈ ఇద్దరూ నిజంగానే స్నేహితులు అయిపోయారు అనుకునే సమయానికి మరో వివాదం తెరపైకి వస్తుంది. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ ఈ సారి అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించాడు. పైగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి అండదండలు కూడా ఉన్నాయని నాగబాబు మాటలతోనే అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు కూడా అధ్యక్ష బరిలోనే ఉంటున్నాడు. దాంతో అసలు కథ మొదలైంది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంటే ఒకప్పుడు జెంటిట్మన్‌ అసోసియేషన్‌ అనేవాళ్లు.

అంటే అంతా కలిసికట్టుగా ఉండి ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నకునేవాళ్లు. లేదంటే పెద్దలు చెప్పిన వాళ్లకే ఓటేసేవాళ్లు. కానీ మూడు నాలుగేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా చూస్తే ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఇవి కూడా మెయిన్ ఎలక్షన్స్ అయిపోయాయి. అందులోనూ ఒకరినొకరు తిట్టుకోవడాలు.. అరుచుకోవడాలు చేస్తున్నారు. కుదిర్తే కొట్టేలా కూడా కనిపిస్తున్నారు. అంతగా రచ్చ జరుగుతుంది.

chiranjeevi vs mohan babu,chiranjeevi vs mohan babu maa elections,chiranjeevi vs mohan babu maa association,chiranjeevi vs mohan babu manchu vishnu prakash raj,manchu vishnu vs prakash raj,telugu cinema,మా అసోసియేషన్ ఎన్నికలు 2021,మా ఎన్నికలు చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు
చిరంజీవి, మంచు విష్ణు (Chiranjeevi Manchu Vishnu)


ఈ సారి ఏకంగా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు జరిగేలా కనిపిస్తుంది. ఇండస్ట్రీకి పెద్దగా దాస‌రి నారాయణరావు ఉన్న‌ప్పుడు ఆయ‌న మాట చెల్లుబాటు అయింది. అప్పుడు ‘మా’లో లుకలుకలు లేకుండా ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగానే సాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. అయితే ఈ మధ్యే చిరంజీవి, మోహన్‌ బాబు, కృష్ణంరాజు లాంటి వాళ్లంతా కలిసి తామంతా ఒక్కటే అని చెప్పుకున్నారు. ఇప్పటికైనా సమస్య అయిపోతుందేమో అనుకున్నారంతా.

prakash raj,prakash raj twitter,prakash raj instagram,prakash raj movies,prakash raj MAA elections 2021,prakash raj MAA contest chiranjeevi support,prakash raj chiranjeevi support,ప్రకాశ్ రాజ్,ప్రకాశ్ రాజ్ మా అసోసియేషన్ ఎన్నికలు,చిరంజీవి మా అసోసియేషన్ చిరంజీవి మద్దతు
చిరంజీవి ప్రకాశ్ రాజ్ (Chiranjeevi Prakash Raj)


రాబోయే మా అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్లీ మొదటికొచ్చింది. ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా మంచు విష్ణు నిలబడుతున్నాడు. చిరంజీవి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో అర్థం కాకుండా మారిపోయింది. ఓ వైపు ప్రకాశ్ రాజ్‌కు చిరు సపోర్ట్ ఉందని నాగబాబు మాటల్లోనే అర్థమైపోయింది. మరి మంచు విష్ణుకు ఎవరు సపోర్ట్ చేస్తారు.. చిరు అక్కడా ఇక్కడా ఉంటాడా..? ఏం జరుగుతుందో ఆసక్తికరంగా మారింది.
Published by:Praveen Kumar Vadla
First published: