MAA ELECTIONS 2021 MANCHU VISHNU VS PRAKASH RAJ MAA ELECTIONS POLLING TO BE HELD TODAY HERE IS INTERESTING DETAILS ABOUT MAA SK
MAA Elections: నేడే మా ఎన్నికలు.. ప్రకాశ్ Vs విష్ణు.. నటీనటుల సంఘం గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు
MAA Elections 2021: ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు.
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికలు కాకా రేపుతుంటే.. అంతకు మించిన స్థాయిలో టాలీవుడ్లో 'మా' ఎన్నికలు సెగలు రేపుతున్నాయి. కొన్ని రోజులుగా అంతటా చలనచిత్ర కళాకారుల సంఘం (Movie Artist Association) ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) పోటీ పడుతుండడంతో ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి.. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవండంతో.. సాధారణ ఎన్నికల మాదిరే మా ఎన్నికలు కూడా హట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు మంచు విష్ణుకు బాలకృష్ణ (Balakrishna), కృష్ణంరాజు (Krishnam Raju), కోటా శ్రీనివాసరావు (Kota srinivasarao), నరేష్ (Naresh) మద్దతు ప్రకటించారు. ఇక ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ అండగా ఉంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
నేడే మా ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో 26 మంది కార్యవర్గం కోసం 54 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883కి మందికి ఓటుహక్కు ఉంది. ఐతే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఈసారి 500 మంది వేసే ఛాన్స్ అవకాశముంది. మాలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ నటులు 125 మంది ఉన్నారు. వీరిలో 60 మంది సీనియర్లు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ కో ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీ చేస్తున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 1994లో ఏర్పాటయింది. అప్పుడు వంద మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి వ్యవహరించారు. ఆ తర్వాత మోహన్‌బాబు, నాగార్జున, నాగబాబు కూడా మా అధ్యక్షుడిగా పనిచేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆరేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉన్నారు. 1015లో జయసుధపై రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. 2017లో శివాజీరాజా మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో శివాజీ రాజాపై నరేష్ విజయం సాధించారు. ఈసారి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు 50 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యాక.. మొదట ఈసీ మెంబర్ ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత అధ్యక్షుడి ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.