టాలీవుడ్ (Tollywood)లో కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. పోలింగ్ రోజు గొడవలు, మంచు విష్ణు (Manchu Vishnu) విజయం, ప్రకాశ్ రాజ్ (Prakash raj) ప్యానెల్ రాజీనామా వంటి అంశాలతో.. 'మా'లో రచ్చ రచ్చ జరిగింది. అంతేకాదు కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రకాశ్ రాజ్ కోర్టు మెట్లెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామల మధ్యే నేడు మా కొత్త కార్యకర్గం కొలువుదీరనుంది. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav)ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా మంచు విష్ణు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. కోటా శ్రీనివాస రావు, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణతో పాటు కొందరు సీనియర్ నేతల వద్దకు మంచు విష్ణు స్వయంగా వెళ్లి కలిశారు. మరికొందరికి ఫోన్ కాల్ చేసి ఆహ్వానించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులకు కూడా ఫోన్ కాల్ చేసి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ చిరంజీవికి మాత్రం ఆహ్వానం అందలేని తెలుస్తోంది.
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రానా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన..
మరోవైపు అక్టోబరు 14న మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ (Manchu Manoj).. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌లో పవన్ కల్యాణ్ (Pawan kalyan)ను కలిశారు. సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించారు. మా ఎన్నికల అనంతరం టాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు తాజా చిత్రాల గురించి వీరిద్దరు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఐతే మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమం వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చిదా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.
తమపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. మా కుటుంబ సభ్యులంతా ఒక్కటేనని మంచు విష్ణు చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని.. మా మెంబర్స్ సంక్షేమం కోసం అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు.
అక్టోబర్ 29న విడుదలకానున్న నాగశౌర్య వరుడు కావలెను..
సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా .. గెలిచిన అభ్యర్థులు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాతే తమ పదవి బాధ్యతలు చేపడతారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వారు ఆ పదవిలో ఉన్నట్లు భావించాలి. కానీ మంచు విష్ణు ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్నికల గెలిచిన తర్వాత ఇటీవలే ఆయన మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు పెన్షన్‌లపై తొలి సంతకం చేశారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
జబర్దస్త్ షో జడ్జిగా నందమూరి బాలకృష్ణ... వీడియో వైరల్...
కాగా, మోహన్ బాబుపై ప్రకాశ్ రాజ్ వర్గం గుర్రుగా ఉంది. ఎన్నికల రోజు తమ టీమ్ మెంబర్స్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ రోజు జరిగిన పరిణామాలను తలచుకొని బెనర్జీ, తనీష్ కంటతడిపెట్టారు. అంతేకాదు మంచు విష్ణు ప్యానెల్ స్వేచ్ఛగా పనిచేసుకోవాలనే ఉద్దేశంతో... తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారు? ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలపై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA Elections, Manchu Vishnu, Mohan Babu, Prakash Raj, Tollywood