MAA Elections 2021 : ప్రకాష్ రాజ్ పై సీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు.. దాసరి కలలో కనిపించారంటూ..

ప్రకాష్ రాజ్ పై సీవీఎల్ నరసింహారావు (Twitter/Photo)

MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) ఎన్నికలు గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మా అధ్యక్ష బరిలోంచి పక్కకు తప్పుకున్న సీవీఎల్ నరసింహారావు మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ప్రకాష్ రాజ్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

 • Share this:
  MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) ఎన్నికలు గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అంతేకాదు ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచేవాళ్లు ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ’మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు హేమా (Hema), జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar),సీవీఎల్ నరసింహారావు (CVL Narasimha Rao) పోటీలో ఉన్నారు. చివరకు నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) కూడా ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ చివరకు పోటీలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు.

  అంతేకాదు ఇరు ప్యానెల్స్‌కు చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. మంచు విష్ణు ఫ్యానెల్ లోకల్, నాన్ లోకల్‌గా ఈ ఎన్నికలను మార్చివేసారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా మంచు విష్ణు ప్యానెల్‌ తీరును ఎండగడుతున్నారు. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీలో జరగుతున్న ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష బరిలో నిలబడి.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్న సీనియర్ నటుడు కమ్ లాయర్ సీవీఎల్ నరసింహారావు ప్రకాష్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

  Samantha : విడాకుల తర్వాత సమంత అప్పుడే సొంత కుంపటి.. వైరల్ అవుతోన్న న్యూస్..

  ఈ వీడియోలో ఆయన మంచు విష్ణుకు సంబంధించిన ప్యానెల్‌కు సపోర్ట్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఇది దివంగత దాసరి నారాయణ రావు తనకు కలలో కనిపించి చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీలో పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు దాసరి గారు .. మోహన్ బాబు తనకు పెద్దబ్బాయి లాంటి వారు. ఆయన కుమారుడు తనకు మనవడితో సమానం. ఆయనకు సపోర్ట్ చేయమంటూ వ్యాఖ్యానించారు.

  Nagarjuna - RamyaKrishna: బంగార్రాజు సహా నాగార్జున, రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

  ఇక ప్రకాష్ రాజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇపుడంటే ఆయన ఎన్నికల్లో నిలబడుతున్నారని అందరు ఆయనకు సపోర్ట్‌గా చేస్తున్నారు కానీ.. ఒకానొక దశలో ప్రకాష్‌ రాజ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ఆరు సార్లు బ్యాన్ చేశారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం నుండి ఆయన రెండు సార్లు సస్పెండ్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు అతను చికాకు పెట్టడం వల్ల కానీ.. సెట్లో దర్శకులను చిరాకు పుట్టించే విధానం వల్ల ఆయన పై చాలా మందికి సదభిప్రాయం లేదు.

  Super Star Krishna : సూపర్ స్టార్ ఇంట్లో ఘనంగా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు.. హాజరైన కుటుంబ సభ్యులు..

  తెలుగు సినిమాకు అదృష్టం కొద్ది రావు రమేష్ దొరికారు. ప్రకాష్ రాజ్‌కు ప్రత్యామ్నాయంగా అన్ని పాత్రలను అలవోకగా చేసేస్తున్నారు. లేకపోతే తెలుగు హీరోలకు నాన్న పాత్రంటే ముందుగా ప్రకాష్ రాజే గుర్తుకు వచ్చేవారు. ఓ వ్యక్తిగా ఆయనంటూ సదభిప్రాయం లేకపోయినా.. ఓ ఆర్టిస్ట్‌గా ప్రకాష్ రాజ్‌కు వందకు వంద మార్కులు వేస్తానన్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: