Home /News /movies /

MAA Elections - Prakash Raj panel resign: ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలనం.. ఎన్నికల్లో గెలిచిన సభ్యులంతా రాజీనామా..!

MAA Elections - Prakash Raj panel resign: ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలనం.. ఎన్నికల్లో గెలిచిన సభ్యులంతా రాజీనామా..!

ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకాష్ రాజ్‌ ప్యానెల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టనున్నారు. ప్రకాష్ రాజ్‌ ప్యానెల్‌ నుంచి బెనర్జీ (ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్‌ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), ఉత్తేజ్‌ (జాయింట్‌ సెక్రటరీ).. ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్‌, తనీష్‌, సురేశ్‌ కొండేటి, సమీర్‌, సుడిగాలి సుధీర్‌, కౌశిక్‌ విజయం సాధించారు.

MAA Elections - Prakash Raj panel resign: మా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయిన తర్వాత మరింత వేడి రాజుకుంటుంది. మంచు విష్ణు (MAA Elections - Prakash Raj panel resign) గెలిచిన తర్వాత ఆ ప్యానెల్ పండగ చేసుకుంటున్నారు.. సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
మా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయిన తర్వాత మరింత వేడి రాజుకుంటుంది. మంచు విష్ణు గెలిచిన తర్వాత ఆ ప్యానెల్ పండగ చేసుకుంటున్నారు.. సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మాత్రం సంచలనం రేపుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో 11 మంది సభ్యులు మా అసోసియేషన్ నుంచి గెలిచారు. శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ లాంటి సీనియర్స్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కీలక పదవుల్లో గెలిచారు. ఇప్పుడు గెలిచిన సభ్యులంతా రాజీనామా చేసారు. దాంతో అసలు సమస్య మొదలైంది. మంచు విష్ణు మా అసోసియేషన్‌కు మంచి చేయాలంటే తాము అక్కడ ఉండకూడదని.. ఎందుకంటే తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు తమకు కూడా ఉంటుందని.. అలా అడిగినపుడు పనులు జరగవంటూ బాధ పడుతున్నారు మా సభ్యులు. మళ్లీ గొడవలు మొదటికే వస్తాయి కాబట్టి రాజీనామా చేయడమే మంచిదనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ప్రకాష్ రాజ్ ప్యానెల్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Actor prakash raj, MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు