చిన్న చిన్న వివాదాలు మినహా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ప్రశాంతంగా కొసాగుతున్నాయి. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసేందుకు నటీనటులు క్యూకట్టారు. ఐతే పోలింగ్ సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్ల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం, ప్రకాశ్ రాజ్ గన్మెన్లను మంచు విష్ణు అడ్డుకోవడం, శివ బాలాజీ చేతిని హేమ కొరికేయడం వంటి.. ఘటనలతో కాస్త గందరగోళం తలెత్తింది. ఐతే ఈ వివాదంపై నటి హేమ స్పందించారు. శివ బాలాజీ చేతిని కొరికిన అంశంపై ఆమె వివరణ ఇచ్చారు. తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని హేమ చెప్పారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో చేయి కొరకాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అంతేతప్ప దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
పోలింగ్ సమయంలో విష్ణు ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోపంతో శివబాలాజీ చేతిని హేమ కొరికారు. అతడి చేతిపై పళ్ల గాట్లను మీడియాకు చూపించారు నటుడు నరేష్. చేతిని కొరడమేంటని.. నో బైటింగ్.. ఓన్లీ ఓటింగ్ అని ఆయన అన్నారు. మరోవైపు తనకూ బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని నటుడు శివ బాలాజీ చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుంటే వాగ్వాదం మాత్రమే జరిగినట్లు తెలిపారు. ఇక హేమ తన చేతిని కొరికిన విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు శివ బాలాజీ.
MAA Elections: పోలింగ్ రద్దు.. ఫలితాల్లేవు.. కోర్టులో చూసుకుందాం అంటూ ఎన్నికల అధికారి ఫైర్
ప్రస్తుతం మా అసోసియేషన్‌లో 925మంది సభ్యులు ఉన్నారు. అందులో 883మందికి ఓటు హక్కు ఉంది. ఐతే మధ్యాహ్నం 12 గంటల వరకు 430 మంది ఓట్లు వేశారు. అంటే 48 శాతం పోలింగ్ నమోదయింది.చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, అల్లరి నరేష్, తనికెళ్ల భరణి, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, అలీ, వడ్డె నవీన్, సుమన్, సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, సుమన్, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రోజా, రాఘవ, జెనీలియా, నిత్యా మీనన్, రాశి, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, ఆర్.నారాయణమూర్తి, చలపతిరావు, రవిబాబు, బండ్ల గణేష్, గిరిబాబు, బ్రహ్మాజీ ఓటువేశారు.
MAA Elections 2021: వాళ్ల వల్లే గొడవలు.. 'మా' ఎన్నికల తీరుపై రోజా కీలక వ్యాఖ్యలు
మా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు. మొదట కార్యనిర్వాహక సభ్యుల ఫలితాలను ప్రకటించి.. చివరకు అధ్యక్షుడి ఫలితాలను వెల్లడిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA Elections, Manchu Vishnu, Prakash Raj, Tollywood