MAA Elections: 'మా' ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల వాగ్వాదం

మా ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద గొడవ

MAA Elections 2021: మా ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.

 • Share this:
  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు (Manchu Vishnu), ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెళ్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. రాజకీయ ఎన్నికల సమయంలో గొడవలు జరిగినట్లు గానే.. మా ఎన్నికల పోలింగ్ సమయంలోనూ.. ఫైట్లు జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా రచ్చ జరుగుతోంది. అందరం ఒక్కటేనని విష్ణు, ప్రకాశ్ రాజ్ చెప్పిన కాసేపటికే.. వీరి గ్రూప్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికలకు ముందే కాదు.. పోలింగ్ సమయంలో.. మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో విష్ణు ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ వర్గానికి చెందిన అభ్యర్థులపై మోహన్ బాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మా సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చారని మంచు విష్ణు మండిపడ్డారు. మాస్క్‌తో ఉన్న ఓ వ్యక్తిని బయటకు పంపించారు. ప్రకాశ్ రాజ్ గన్‌మెన్లను లోపలికి వెళ్లకుండా ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడం రిగ్గింగ్‌తో సమానమన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే ప్రచారం చేయడం రిగ్గింగ్ ఎలా అవుతుందని, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎదురు దాడికి దిగారు. వీరి వివాదంలో ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు కలగజేసుకోవడంతో ఇరువర్గాలు శాంతించాయి. గొడవ అనంతరం దీనిపై ప్రకాశ్ రాజ్, నరేష్ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదని తెలిపారు. నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్ అని ఆయన చెప్పుకొచ్చారు.

  MAA Electionsపై ట్విస్టింగ్ కామెంట్స్ -మంచు దెబ్బ కాచుకున్న Pawan Kalyan?-స్వయంగా పోటీపై..

  మా ఎన్నికల్లో ఇప్పటికే చాలా మంది ఓటు హక్కు వినియోగించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె నవీన్, సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, సుమన్, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రాఘవ ఓటువేశారు.

  ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో 26 మంది కార్యవర్గం కోసం 54 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883కి మందికి ఓటుహక్కు ఉంది. ఐతే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఈసారి 500 మంది వేసే ఛాన్స్ అవకాశముంది. మాలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ నటులు 125 మంది ఉన్నారు. వీరిలో 60 మంది సీనియర్లు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ కో ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

  మా ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published: