హోమ్ /వార్తలు /సినిమా /

Maa - Karate Kalyani: కరాటే కళ్యాణి పై వేటు వేసిన ‘మా’ అసోసియేషన్.. అసలు కారణం అదేనా..

Maa - Karate Kalyani: కరాటే కళ్యాణి పై వేటు వేసిన ‘మా’ అసోసియేషన్.. అసలు కారణం అదేనా..

కరాటే కళ్యాణిపై వేటు (File/Photo)

కరాటే కళ్యాణిపై వేటు (File/Photo)

Karate Kalyani - Manchu Vishnu: కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు పంపించడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Maa - Karate Kalyani: కరాటే కళ్యాణి పై వేటు వేసిన ‘మా’ అసోసియేషన్.. రీసెంట్‌గా ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కరాటీ కళ్యాణికి ‘మా’ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసారు. ఈ విషయమై కరాటే కళ్యాణి స్పందించింది. రీసెంట్‌గా  కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయమై షోకాజ్ నోటీసులు పంపించడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 28న అన్న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఆయన 100వ జయంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే గత యేడాది నుంచి వివిధ కార్యక్రమాలు ఆయన తనయుడు బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు చేపట్టిన విషయం తెలిసిందే కదా. ఇక ఆ మహానాయకుడి జన్మ దినం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని లకారం చెరువు మధ్యలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠంచబోతున్నట్టు  తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ఈ విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ మనవడు .. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందజేసాడు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ జరగబోతుంది.

అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ.. ఆయన విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో పెట్డడంపై భారత యాదవ సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ‘‘దేవుడి రూపంలో విగ్రహాలు పెడితే.. ధ్వంసం చేస్తామని వార్నింగ్’’ కూడా ఇచ్చాయి. లేకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరికలు చేసారు. అయితే ఈ విగ్రహావిష్కరణపై నటి కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు పంపించారు.ఇప్పటికే దేవుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంపై హైకోర్టు స్టే విధించింది. ఐతే.. నిర్వాహకులు విగ్రహ రూపంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పెట్టనున్నట్టు తెలిపారు. ఈ విగ్రహంలో కొన్ని మార్పులు చేసినా.. పూర్తిగా మార్చలేదు. పించం తీసేశాం, ఫ్లూట్ తీసేశాం.. కౌస్తుభం తీసేయలేదు. కర కంకణాలు తీయలేదు.  నేనేమి తప్పు చేయలేదు. మా ఇంట్లో అందరు ఎన్టీఆర్ అభిమానులం. మా తమ్ముడి పేరు తారక రామారావు.  మా ఇంట్లో ఎన్టీఆర్ పెద్ద ప్యాన్. కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. ప్రజలు కృష్ణాష్టమి రోజున కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ను పూజిస్తారా.. ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ రాముడి విగ్రహం పెడితే.. ఒప్పుకుంటారా.. ? మరోవైపు నేను అమ్మవారి వేషం వేసాను. నన్ను విగ్రహం కొలుస్తారా.. మేము చేసిన పోరాటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. ఇందులో నైతిక విజయం మాదే అంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఈ విషయమై కరాటీ కళ్యాణి మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ అంటే మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. కానీ ఆయన విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో పెట్డడంపైనే మాకు అభ్యంతరం ఉందన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన విగ్రహం పెడితే సంతోషించే వాళ్లలో నేను ముందుంటాను. కాకపోతే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో పెట్టడం పైనే అసలు సమస్య అన్నారు. ఆత్మ విమర్శ చేసుకొని ఈ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు.

మేమేమి బానిసలం కాదు.. వ్యక్తి పూజ చేయడం లేదు. నేను భక్తితో చేస్తోన్న ఈ పోరాటం సరైనదే అని భావిస్తున్నానన్నారు. నా ఇష్ట దైవం, కుల దైవం, కుల సంఘంలో ఉన్న నాయకురాలిగా.. (అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళ అధ్యక్షురాలి) హోదాలో ఈ నేను ఈ  పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకొని తీరుతామన్నారు. ఈ విషయమై ‘మా’ నుంచి తనకు బెదిరింపులు కాదు కానీ.. షోకాజ్ నోటీసులు అందినట్టు చెప్పారు. ఇక సినీ  ఇండస్ట్రీ నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. సినీ పరిశ్రమకు దేవుడు లాంటి ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం భావ్యం కాదని చాలా మంది చెప్పారు.

Tollywood Heroes Education: టాలీవుడ్‌ను ఏలుతున్న ఈ తెలుగు హీరోల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తెలుసా..

అంతేకాదు తన స్టాండ్ మార్చుకోమన్నారు. నేనేం తప్పు చేయడం లేదన్నారు. షోకాజ్ నోటీసు తర్వాత క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని  చెప్పారు. నాతో పాటు కొన్ని కుల సంఘాల నాయకలు, హిందూ సంఘాల నేతలు కూడా దేవుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను వ్యతిరేకిస్తున్నారు. వారితో కలిసి కలిసి నేను ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని కళ్యాణి పేర్కొ న్నారు. అయితే.. షోకాజ్ నోటీసుల అందుకున్న మూడు రోజుల్లో కరాటే కళ్యాణి.. వివరణ ఇవ్వాలని కోరారు. ఈ విషయమైన కరాటే కళ్యాణి ఇచ్చిన వివరణపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెను ‘మా’ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Karate Kalyani, MAA Association, Manchu Vishnu, Tollywood

ఉత్తమ కథలు