Home /News /movies /

MAA ASSOCIATION NEW PRESIDENT MANCHU VISHNU GETS VERY EMOTIONAL AFTER HE WON PK

Manchu Vishnu Emotional: ఎన్నికల ఫలితాలు విని ఏడ్చేసిన మంచు విష్ణు.. ఓదార్చిన ప్రకాష్ రాజ్..

మంచు విష్ణు (Twitter/Photo)

మంచు విష్ణు (Twitter/Photo)

Manchu Vishnu Emotional: మా అసోసియేషన్ ఎన్నికలను మంచు ఫ్యామిలీ (Manchu Vishnu Emotional) ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే అర్థమవుతుంది. ఆ పీఠం గెలవకపోతే ఇండస్ట్రీలో ఉండటం వేస్ట్ అన్న స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు.

ఇంకా చదవండి ...
మా అసోసియేషన్ ఎన్నికలను మంచు ఫ్యామిలీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే అర్థమవుతుంది. ఆ పీఠం గెలవకపోతే ఇండస్ట్రీలో ఉండటం వేస్ట్ అన్న స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో 900 పైగా సభ్యులు ఉంటే.. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఫోన్ చేసి తమను గెలిపించాలని కోరాడు మంచు విష్ణు. తాను గెలిస్తే ఏం చేస్తానో కూడా చెప్పాడు. రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేశాడు. సొంత ఇల్లు కట్టిస్తాను.. ఉచిత విద్య ఇప్పిస్తాను.. ఆరోగ్య భీమా ఇస్తాను అంటూ మా సభ్యులకు వరాల జల్లు కురిపించాడు మంచు విష్ణు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు సభ్యులు కూడా అతన్ని భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిచినంత మాత్రాన సంబరాలు చేసుకోవడం కాదు.. భయంకరమైన ప్రతిజ్ఞలు నా బిడ్డ ఇచ్చాడు.. అన్నీ చేసి చూపిస్తాడు అంటూ మోహన్ బాబు మీడియా ముందు చెప్పాడు.

ఇవన్నీ ఇలా ఉంటే మంచు విష్ణు తెలిసిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆయన గెలిచిన విషయాన్ని అధికారికంగా ఎన్నికల అధికారి ప్రకటించిన వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న ప్రకాష్ రాజ్ ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు మంచు విష్ణు. మైక్ తీసుకునే ముందు స్టేజి వెనక్కి వెళ్లి ఏడ్చి కాసేపటి తర్వాత మీడియా ముందుకు వచ్చాడు విష్ణు. ఎన్నో రోజుల నుంచి కష్టపడిన విజయం ఒక్కసారిగా రావడంతో ఎమోషనల్ అయ్యాడు మంచు వారబ్బాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero manchu vishnu, MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు