Chandrabose: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డును నాటు నాటు పాటకు గాను కీరవాణితో కలిసి అందుకున్న గేయ రచయత చంద్రబోస్.. ఆమెరికా నుంచి రాగానే నేరుగా తనకు పాటల రచయతగా తొలిసారి అవకాశం ఇచ్చిన రామానాయుడు గారిని తలుచుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆయన తనయుడు సురేష్ బాబును కలసుకున్నారు. ఈ సందర్భంగా ‘తాజ్ మహల్’ సినిమాతో తనకు పాటల రచయతగా అవకాశం ఇచ్చిన రామానాయుడును తలుచుకొని తన మూలాలు గుర్తు చేసుకున్నారు. చంద్రబోస్.. తనకు రచయతగా తొలి అవకాశం ఇచ్చిన వారిని గుర్తు పెట్టుకొని వారిని తలుచుకోవడంపై నెటిజన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మన తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును తొలిసారి గెలుచుకుంది. ఒక భారతీయ సినిమా బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరిలో అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు.. 2023 ఆస్కార్‌లో పలువురు తొలిసారి ఈ అవార్డు అందుకోవడం విశేషం.ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలందరు పండగ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ గురించి చర్చించుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టే విధంగా చంద్రబోస్ ఈ పాటను రాసారు. ముఖ్యంగా తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ఇపుడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
తెలుగు సినీ సింగర్ చంద్ర బోస్ గురించి, ఆయన పాడే పాటల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన పాటలకు రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈయన మరో తెలుగు సినీ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సుచిత్రా చంద్రబోస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన పూర్తి పేరు కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్. తాజ్ మహల్ సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత బావగారు బాగున్నారా, పెళ్లి సందడి, ప్రేమంటే ఇదేరా, మాస్టర్ ఇలా ఎన్నో మంచి హిట్లు అందుకున్న స్టార్ హీరోల సినిమాలలో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకున్నాడు చంద్రబోస్. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటతో మరోసారి ఆస్కార్ గెలుచుకొని వార్తల్లో నిలిచారు. ఏది ఏమైనా ఆస్కార్ గెలిచినా.. తన మూలాలు మరవని చంద్రబోస్ తీరును అందరు మెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: D.Rama Naidu, Lyricist Chandrabose, Suresh Babu, Tollywood