దర్బార్‌లో వివాదాస్పదంగా మారుతున్న డైలాగ్‌పై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ స్పందించింది. గురువారం విడుదలైన ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసు అధికారిగా నటించగా.. ఒక సన్నివేశంలో జైలులో ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. అప్పుడు డబ్బులుంటే ఖైదీలు షాపింగ్ కూడా వెళ్లొచ్చన్న డైలాగ్ ఉంది. ఆ సన్నివేశంలో ఎక్కడా శశికళ పేరు లేకపోయినా.. అది శశికళను ఉద్దేశించే పెట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శశికళను కించపరిచినట్లుగా భావిస్తున్న సంభాషణ తొలగించాలని ఆమె తరపున న్యాయవాది డిమాండ్ చేశారు. దీనిపై వివాదం మరింత ముదరడంతో... చిత్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ దీనిపై వివరణ ఇచ్చింది.
#DARBAR @rajinikanth @ARMurugadoss #Nayanthara @anirudhofficial @santoshsivan @sreekar_prasad #Santhanam @SunielVShetty #DarbarThiruvizha #DarbarRunningSuccessfully 💥🔥 pic.twitter.com/zj6Mcwsxu3
— Lyca Productions (@LycaProductions) January 10, 2020
ఆ డైలాగ్ కేవలం వినోదం కోసమే అని... ఎవరినీ ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది. దాని వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్టుగా భావిస్తే... దాన్ని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్విట్ ద్వారా ప్రకటించింది. గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన దర్బార్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మురుగుదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో చాలా గ్యాప్ తరువాత రజినీకాంత్‌కు హిట్ వచ్చిందని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, Rajinikanth, Sasikala