news18-telugu
Updated: July 15, 2020, 1:00 PM IST
చిరంజీవి Photo : Twitter
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పాడు. మలయాళంలో సూపర్ హిట్టైనా లూసిఫర్ తెలుగు రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను చిరంజీవి యువ దర్శకుడు సుజిత్‌కు అప్పజెప్పినట్లు.. అంతేకాదు సుజీత్ తెలుగు నేటివిటికి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుజీత్ చేసిన మార్పులు, ఆయన చేసిన చేర్పులు చిరంజీవికి నచ్చలేదట. సుజీత్ రాసిన స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందని చిరు ఈ క్రేజీ ప్రాజెక్టును అనుభవం ఉన్న డైరెక్టర్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగా ఈ సినిమాను వినాయక్‌తో చేయాలనీ నిర్ణయానికి వచ్చాడట. వినాయక్, చిరంజీవి కాంబినేషన్లో గతంలో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టైనా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఖుష్బూను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Published by:
Suresh Rachamalla
First published:
July 15, 2020, 12:59 PM IST