హోమ్ /వార్తలు /సినిమా /

Love Today Movie Review: ’లవ్ టుడే’ మూవీ రివ్యూ.. ఫీల్ గుడ్ లవ్ డ్రామా..

Love Today Movie Review: ’లవ్ టుడే’ మూవీ రివ్యూ.. ఫీల్ గుడ్ లవ్ డ్రామా..

లవ్ టుడే మూవీ రివ్యూ (Twitter/Photo)

లవ్ టుడే మూవీ రివ్యూ (Twitter/Photo)

Love Today Movie Review : ఈ మధ్య కాలంలో హీరోలు, దర్శకులుగా మారుతున్నారు. కాంతారాతో రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా సత్తా చాటారు. అదే బాటలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. తెలుగు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై దిల్ రాజు రిలీజ్ చేసాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అలరించనుందో చూడాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : లవ్ టుడే (Love Today)

నటీనటులు : ప్రదీప్ రంగనాథన్,సత్యరాజ్, ఇవానా,రాధిక శరత్ కుమార్, యోగిబాబు  తదితరులు..

ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్

సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమ్

సంగీతం: యువన్ శంకర్ రాజా

నిర్మాత : కల్పాతి ఎస్. అఘోరం,కల్పాతి ఎస్.గణేష్,కల్పాతి ఎస్.సురేష్

దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్

విడుదల తేది : 25/11/2022

ఈ మధ్య కాలంలో హీరోలు, దర్శకులుగా మారుతున్నారు. కాంతారాతో రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా సత్తా చాటారు. అదే బాటలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. తెలుగు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై దిల్ రాజు రిలీజ్ చేసాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత, (ఇవానా) ఇద్దరు ప్రేమికులు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో వీరి ప్రేమ విషయం హీరోయిన్ తండ్రి (సత్యరాజ్) కి తెలుస్తోంది. అతను హీరోను పిలుస్తాడు. వీళ్లిద్దరి మ్యారేజ్‌ు యాక్సెప్ట్ చేయడానికి హీరోయిన్ ఫాదర్ ఓ షరుతు విధిస్తాడు. అది ఒకరోజు వీళ్లిద్దరు మొబైల్ ఫోనులు ఒకరు మార్చుకోవాలనే కండిషన్ చెబుతాడు. ఈ నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి నిజాలు తెలిశాయి. చివరకు వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలే  ‘లవ్ టుడే’ స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..

ఈ సినిమాకు దర్శకుడు, హీరో ఒకటే కావడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తాను అనుకున్న కథను అదే రేంజ‌్‌లో యూత్‌కు నచ్చేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇతను ప్రస్తుతం సమాజంలో నడుస్తోన్న ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని .. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు. ఈయన రూపొందించిన అప్పా లాక్ (Appa Lock) షార్ట్ ఫిల్మ్ (యూట్యూబ్‌లో ఉంది)నే లవ్ టుడేగా రూపొందించాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు చిన్నపాటి అపార్ధాలతో ఎలా విడిపోతున్నారనేది చక్కగా చూపించాడు. ముఖ్యంగా సెల్‌ఫోన్ మనుషులు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయో.. ఎంటర్టైన్మెంట్‌గా తీర్చిదిద్దుతూనే ఎమోషన్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెల్‌ఫోన్ మార్చుకోవడం వంటి చిన్న పాయింట్‌ను పెట్టుకొని ఈ సినిమాను చక్కగా మలిచాడు. అంతేకాదు ప్రతి పాత్రను సినిమాలో ఇన్వాల్స్ చేసేలా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది.

టెక్నికల్ గా కూడా ఆకట్టుకుంది..సంభాషనలు సినిమాకు బలం తీసుకొచ్చాయి ఇతనికి దర్శకుడిగానే కాదు... నటుడిగా మంచి ఫ్యూచర్ ఉంది.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ సెకండాప్‌లో తన కత్తెరకు పదను పెడితే బాగుండేది. పాటలు ఓ మోస్తరు పర్వాలేదనిపించేలా ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

దర్శకుడు, హీరో అయిన ప్రదీప్ రంగనాథన్.. తాను రాసుకున్న కథకు తన పాత్రతో న్యాయం చేసాడు. చాలా సీన్స్‌ను ఎంతో ఈజ్‌తో నటించాడు. హీరోగా మంచి ఫ్యూచర్ ఉంది. ముఖ్యంగా జెలసీ, అపనమ్మకం వంటి ఎక్స్‌ప్రెషెన్స్ తన ముఖంలో బాగా పండించాడు. హీరోయిన్‌గా నటించిన ఇవాకా తన నటనతో ఆకట్టుకుంది. మరోవైపు సత్యరాజ్ ఈ సినిమాకు తన నటనతో ప్రాణం పోసాడు. ఇక యోగిబాబు కామెడీ ఈ సినిమా చూసే ప్రేక్షకులను నవ్విస్తోంది. ఇందులో యోగిబాబు తన సెల్‌ఫోన్‌ కామెడీ హైలెట్‌గా నిలిచింది.

జలసీ,అపనమ్మకం లాంటి హావా భావాలు ప్రదర్శించేటపుడు హీరో మంచి నటన ప్రదర్శించాడు.అంతేకాదు ప్రతీ పాత్రను..సినిమాలో ఇన్వాల్ చేసేలా తీర్చిదిద్దిన విధానం బాగుంది..హీరో ప్రెండ్స్ ..మధ్య నడిచే సన్నివేశాలు..హీరోకు హెల్స్ చేసేటపుడు వచ్చే సన్నివేశాలు..హిలేరిసియస్ గా చిత్రీకరించారు.

యోగిబాబు కామెడీ కూడా నవ్విస్తుంది.ఈయన సెల్ ఎవరికి ఇవ్వకపోవటానికి కూడా..ఓ కారణం చూపించి..బాగా కన్విన్స్ చేసారు. హీరో మదర్ గా నటించిన..రాధికా తమ పాత్రలకు న్యాయం చేసారు.సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యారు

ముఖ్యంగా రాధికా పాత్రను స్టోరీలో ఇన్వాల్ చేసిన విధానం బాగుంది.క్రైమాక్స్ లో కొడుకుతో జరిగే సంభాషనలు హత్తుకుంటాయి.

ప్లస్ పాయింట్స్.. 

కథ. కథనం

హీరో ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, రాధికల నటన

యోగిబాబు కామెడీ

మైనస్ పాయింట్స్ 

అక్కడక్కడ బోర్ కొట్టించే రొటీన్ సీన్స్

ఎడిటింగ్

సెకండాఫ్

చివరి మాట : లవ్ టుడే.. యూత్‌కు నచ్చే ఫీల్ గుడ్ లవ్ డ్రామా..

రేటింగ్: 2.75/5

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు