తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. తెలుగు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై దిల్ రాజు రిలీజ్ చేసాడు. ఈ సినిమాలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, రవీనా రవి, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.నవంబర్ 25న విడుదల అయిన ఈ సినిమా అప్పుడే ఓటీటీ పార్టనర్‌తో పాటు.. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.
తాజా సమాచారం ప్రకారం, లవ్ టుడే మూవీ డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. . ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఐతే, ఇది కేవలం తమిళ్ వెర్షన్ కి మాత్రమే సంబంధించిన అప్డేట్. తెలుగులో రెండ్రోజుల క్రితమే ఈ సినిమా విడుదలైంది కాబట్టి ఇప్పుడప్పుడే డిజిటల్ లోకి వచ్చే అవకాశమే లేదు. మరి, క్రిస్మస్ తరవాత లవ్ టుడే తెలుగు వెర్షన్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఐతే ఉంది.
లవ్ టుడే కథ విషయానికి వస్తే.. ఈ సినిమాకు దర్శకుడు, హీరో ఒకటే కావడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తాను అనుకున్న కథను అదే రేంజ్లో యూత్‌కు నచ్చేలా తెరకెక్కించడంలో అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇతను ప్రస్తుతం సమాజంలో నడుస్తోన్న ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని .. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు. ఈయన రూపొందించిన అప్పా లాక్ (Appa Lock) షార్ట్ ఫిల్మ్ (యూట్యూబ్‌లో ఉంది)నే లవ్ టుడేగా రూపొందించాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు చిన్నపాటి అపార్ధాలతో ఎలా విడిపోతున్నారనేది చక్కగా చూపించాడు.
లవ్ టుడే సినిమాలో ముఖ్యంగా సెల్‌ఫోన్ మనుషులు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయో.. చూపిచాడు. ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దుతూనే ఎమోషన్ పండించడంలో ప్రదీప్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెల్‌ఫోన్ మార్చుకోవడం వంటి చిన్న పాయింట్‌ను పెట్టుకొని ఈ సినిమాను చక్కగా మలిచాడు. అంతేకాదు ప్రతి పాత్రను సినిమాలో ఇన్వాల్స్ చేసేలా అతడు తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood