Love Story Theatrical Trailer : నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన మూవీ ‘లవ్ స్టోరీ’(Love Story). ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు కొత్త థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా పేదింటి తెలంగాణ యువకుడి పాత్రలో నాగ చైతన్య నటన ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాదు శేఖర్ కమ్ముల చైతూలోని నటనను బాగానే రాబట్టినట్టు కనబడుతోంది. నాగ చైతన్య తన కెరీర్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇదే అని చెప్పాలి. మరోవైపు సాయి పల్లవి కూడా తన యాక్టింగ్‌తో ఇరగదీసింది. ముఖ్యంగా మనతో కాదని.. మాటలు అంటున్నరే.. అంటూ సాగే సంభాషణలు బాగున్నాయి. తన తల్లితో చైతూ మన అర ఎకరం పొలం అమ్ముదాం అంటే తల్లి కొట్టడం లాంటి సీన్స్ ఎంతో నాచురల్‌గా ఉన్నాయి.
మరోవైపు ‘బతుకు కోసం ఈ ఊరుకులాడటం మాత్రం నాతోని కాదింక. చస్తే చద్దాం.. కానీ తేల్చకుని చద్దాం అంటూ ట్రైలర్ చివర చైతూ చెప్పే డైలాగ్ బాగుంది. ట్రైలర్ చూస్తుంటే మరో శేఖర్ కమ్ముల నుంచి మరో బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టు అనిపిస్తోంది. మొత్తంగా థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ సినిమాపై మరోసారి అంచనాలు పెరిగేలా చేయడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
It’s 2M+ real time views for #LoveStoryTrailer !!https://t.co/xfbcA1I86V#LoveStory#LoveStoryFromSep24th@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19 @SVCLLP #amigoscreations @AsianSuniel @adityamusic @NiharikaGajula @GskMedia_PR pic.twitter.com/mZRxV9bfLf
— BA Raju's Team (@baraju_SuperHit) September 13, 2021
గత కొన్ని రోజులుగా ‘లవ్ స్టోరీ’ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కే మొగ్గు చూపారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు థియేటర్స్‌లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ చివరకు ఈ సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు మరో తేదిని ప్రకటించారు..‘లవ్ స్టోరీ’ సినిమా విషయానికొస్తే.. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.
లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసారు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం.
NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..
దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కించారు. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్‌లో 300 మిలియన్ (30 కోట్లు) పైగా మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపుతూనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love Story Movie, Naga Chaitanya Akkineni, Sai Pallavi, Sekhar kammula, Tollywood