హోమ్ /వార్తలు /సినిమా /

Love Story Release Date: నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల తేది ఖరారు.. అఫీషియల్ ప్రకటన..

Love Story Release Date: నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల తేది ఖరారు.. అఫీషియల్ ప్రకటన..

లవ్ స్టోరీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

లవ్ స్టోరీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

Love Story Movie Release Date Locked: నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల తేది ఖరారు చేసారు. అంతేకాదు రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసారు.

Love Story Movie Release Date Locked: నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల తేది ఖరారు చేసారు. అంతేకాదు రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కే మొగ్గు చూపారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు థియేటర్స్‌లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

.‘లవ్ స్టోరీ’ సినిమా విషయానికొస్తే..  ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసారు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.

‘లవ్ స్టోరీ’ విడుదల తేది (Twitter/Photo)

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం. దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కించారు.  ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్‌లో 300 మిలియన్ (30 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి..

Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..


Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ అనుబంధం.. ఆలీతో సరదగా సంచలన వ్యాఖ్యలు..


Bigg Boss 5 Telugu: కళ్ల ముందు భారీ రెమ్యునరేషన్ .. ఐనా బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన ఫేమస్ సింగర్, యాంకర్..


Rashmika Mandanna: పూల తలపాగాతో రష్మిక మందన్న రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోస్..


Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..

First published:

Tags: Love Story Movie, Naga Chaitanya Akkineni, Sai Pallavi, Sekhar kammula

ఉత్తమ కథలు