Home /News /movies /

LOVE STORY PRE RELEASE EVENT CHIRANJEEVI NAGARJUNA TO ATTEND SR

Love Story : లవ్ స్టోరి ప్రిరీలీజ్ ఈవెంట్.. చిరంజీవి, నాగార్జున హాజరు...

Naga Chaitanya Love Story Photo : Twitter

Naga Chaitanya Love Story Photo : Twitter

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరుగనుంది.

ఇంకా చదవండి ...
  అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రిరిలీజ్ ఈ వెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిరంజీవి, నాగార్జున రానున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్స్ వల్ల ప్రేక్షకుల్లో మంచి బజ్ వచ్చింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయని తెలుస్తోంది.

  హైదరాబాద్‌లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు బుకింగ్స్ అయిపోయాయి. మహేష్ బాబు AMB సినిమాస్‌లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరేపోయే ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుంది. ఈ ఈవెంట్‌కు గెస్ట్స్‌గా చిరంజీవి, నాగార్జునలు వస్తున్నారని తెలుస్తోంది.

  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ కి నెటిజన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 6 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో అదరగొడుతోంది. లవ్ స్టోరీ ట్రైలర్ 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. వకీల్ సాబ్, బాహుబలి, సాహో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత లవ్ స్టోరీ ఎక్కువగా లైక్స్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది. ఇక ఈ నెల 24న విడుదలకానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసిస్తూ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. లవ్ స్టోరీ 2 గంటల 25 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది.

  Ram Charan-Disney hotstar : రామ్ చరణ్‌కు భారీ పారితోషకాన్ని ముట్టజెప్పిన డిస్నీ హాట్ స్టార్..

  ఇక నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.

  Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌ హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్.. మరికొన్ని రోజులు అక్కడే!

  సారంగ దరియా సాంగ్..

  వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.

  లవ్ స్టోరి కథ విషయానికి వస్తే..

  ఇక లవ్ స్టోరి కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను శేఖర్ కమ్ముల హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కించారు. గతంలో కూడా బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, Love Story Movie, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు