నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి, ఈశ్వరి బాయి, రాజీవ్ కనకాల తదితరులు.. సంగీతం : పవన్ కుమార్ సి.హెచ్
సినిమాటోగ్రఫర్: విజయ్ సి కుమార్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు
దర్శకుడు: శేఖర్ కమ్ముల
తన మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ‘ఫిదా’ తర్వాత మరోసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
రేవంత్ (నాగ చైతన్య) (Naga Chaitanya) హైదరాబాద్‌లో ఓ జుంబా సెంటర్ రన్ చేస్తూ ఉంటాడు. అతని ఇంటి పక్కనే మౌనిక (సాయి పల్లవి)Sai Pallavi ఊరు నుంచి మంచి ఉద్యోగం సంపాదించడం కోసం హైదరాబాద్ వస్తోంది. అతని ఇంటి పక్కనే అద్దెకు దిగుతోంది. జాబ్ కోసం విసిగివేసారి నాగ చైతన్య నిర్వహిస్తోన్న జుంబా సెంటర్లో జాయిన్ అవుతోంది. ఆ తర్వాత వీళ్లిద్దరు ప్రేమలో పడతారు. అన్ని సినిమాల్లో లాగా వీరి ప్రేమకు కులం అడ్డు వస్తోంది. చివరకు కులాలను ఎదిరించి వాళ్ల లవ్ స్టోరీని సక్సెస్ చేసుకున్నారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.
కథనం...
శేఖర్ కమ్ముల విషయానికొస్తే.. సాధారణ ప్రేమకథను తనదైన కథనంతో రక్తి కట్టించారు. సాధారణ ప్రేమకథకు తెలంగాణ నేపథ్యాన్ని జోడించారు. దీనికి నాగ చైతన్య, సాయి పల్లవితో మంచి నటన రాబట్టాడు. ఏమైనా ఓ కథను ఎలా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనేదానికి ‘లవ్ స్టోరీ’ మంచి ఎగ్జాంపుల్. దానికి సరైన నేపథ్యంతో తెరకెక్కించారు. ఇంట్లో ఆడపిల్లలు ఇంట్లో ఎలాంటి లైంగిక హింసకు గురవుతారనే విషయాన్ని చక్కగా చూపించారు. బయట చెప్పడానికి, ఇష్టపడని లైంగిక దాడుల గురించి శేఖర్ కమ్ముల ఈ సినిమాలో చక్కగా చూపించారు. ముఖ్యంగా హీరో జీవితాన్ని చూపిస్తూ.. నేరుగా కథలోకి తీసుకెళ్లారు దర్శకుడు శేఖర్ కమ్ముల. మొదటి భాగం సరదగా తెరకెక్కించిన ఈ సినిమాను.. ద్వితీయార్ధంలో ఊళ్లో కులాల కుమ్ములాటలు, కథ క్లైమాక్స్‌కు చేరుకునే క్రమంలో వచ్చే సీన్స్ మనసుకు హత్తుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ తన ఇంట్లో జరిగిన లైంగిక దాడుల గురించి చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రేమ, పరువు నేపథ్యంలో చివరకు ప్రేమ ఎలా గెలిచిందనేది ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచాయి.
నటీనటులు..
నాగ చైతన్య.. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటన మరో ఎత్తు. పేదింటి తెలంగాణ కుర్రాడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. నాగ చైతన్యలో మంచి నటుడిని శేఖర్ కమ్ముల వెలికి తీసాడు. మరోవైపు సాయి పల్లవి కూడా తెలంగాణ యువతిగా మంచి ఉద్యోగం కోసం పాటు పడే యువతిగా కట్టిపడేసింది. దర్శకుడిగా శేఖర్ కమ్ముల ఒక సాధారణ కథను అసాధారణంగా ప్రేక్షకులను చేరువ చేయడంలో తన దర్శకత్వంతో మైమరిపించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.
బలాల.,..
కథ, కథనం
శేఖర్ కమ్ముల దర్శకత్వం
నాగ చైతన్య, సాయి పల్లవి నటన
బలహీనతలు..
నెమ్మదిగా సాగే ప్రేమకథ
ఫస్టాఫ్
ఎడిటింగ్
రేటింగ్ .. 3/5
చివరి మాట.. ఎమోషనల్‌గా సాగిపోయే లవ్ స్టోరీ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love story, Naga Chaitanya Akkineni, Sai Pallavi, Sekhar kammula, Tollywood