LOVE STORY MOVIE RELEASE ON ANR PREMA NAGAR RELEASE DATE 24 SEPTEMBER HERE ARE THE DETAILS NAGA CHAITANYA WILL WORK OUT FOR ANR TA
Love Story : లవ్ స్టోరీ మూవీ కోసం ప్రేమనగర్ సెంటిమెంట్.. తాత ఏఎన్నార్ బాటలో మనవడు నాగ చైతన్య..
తాత ఏఎన్నార్ ‘ప్రేమనగర్’ రిలీజ్ డేట్లో చైతూ ‘లవ్ స్టోరీ’ విడుదల (Twitter/Photo)
Naga Chaitanya - Sai Pallavi - Sai Pallavi - Love Story : లవ్ స్టోరీ మూవీ కోసం తాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమనగర్’ మూవీ సెంటిమెంట్‌తో రంగంలోకి దిగుతున్నారు.
Naga Chaitanya - Sai Pallavi - Sai Pallavi - Love Story : లవ్ స్టోరీ మూవీ కోసం తాత అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ‘ప్రేమనగర్’ (Prema Nagar) మూవీ సెంటిమెంట్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఈ మూవీ 24 సెప్టెంబర్ 1971లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ఒరవడిని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు(D Rama Naidu) నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఈ మూవీ తర్వాత నిర్మాత రామానాయుడు వెనుదిరిగి చూసుకోలేదు. ఇపుడు నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ (Love Story) సినిమాను తన తాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వాణిశ్రీ హీరోయిన్గా నటించింది. ఆ సినిమాను నాగ చైతన్య మరో తాతగారైన డి.రామానాయుడు నిర్మించడం విశేషం. అలా ఇద్దరు తాతల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రోజున నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం విశేషం.
అంతేకాదు రెండు పోస్టర్స్‌ను కంపేర్ చేస్తూ నాగార్జున ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుదోంది. ఈ నెల 24న ప్రేమనగర్ విడుదలై 50 ఏళ్లు పూర్తవుతోంది. అపుడే అదే రోజున నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించగా.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల కాబోతంది. ‘ప్రేమనగర్’లా ‘లవ్ స్టోరీ’ కూడా ప్రేమ కథా చిత్రాల్లో మరో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. రీసెంట్గా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్‌తో ‘లవ్ స్టోరీ’ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. గత కొన్ని రోజులుగా ‘లవ్ స్టోరీ’ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కే మొగ్గు చూపారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు థియేటర్స్‌లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ చివరకు ఈ సినిమాను సెప్టెంబర్ 24న తాత ఏఎన్నార్ నటించిన ‘ప్రేమ నగర్’ విడుదల రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు..‘లవ్ స్టోరీ’ సినిమా విషయానికొస్తే.. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.
లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసారు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం.దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కించారు. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల.
‘లవ్ స్టోరీ’ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్‌లో 300 మిలియన్ (30 కోట్లు) పైగా మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపుతూనే ఉంది. మరి తాతలకు మంచి పేరు తీసుకొచ్చిన ‘ప్రేమనగర్’ సెంటిమెంట్‌తో నాగ చైతన్య మరో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.