Love Story: కష్టకాలంలో మహేష్ బాబుకు అండగా నిలిచిన నాగ చైతన్య..

Naga Chaitanya and Mahesh Babu Photo : Twitter

Love Story Collections : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.

 • Share this:
  అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు ఇప్పటికే ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి.. బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా ఏఎంబీ సినిమాస్‌లో కోటీ రూపాయల గ్రాస్‌ను సాధించి మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించి AMB సినిమాస్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసింది. లవ్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ అంటూ చెప్పుకోచ్చిన AMB.. దాదాపు 251 షో లకి గానూ మొత్తం 48,233 మంది సినిమాను చూసినట్లు తెలిపింది. అందులో భాగంగా లవ్ స్టోరి కోటి రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో కరోనా సమయంలో సినిమాలు ఆడక కష్టాలపాలైన AMB సినిమాస్‌కు లవ్ స్టోరి సినిమా అండగా నిలిచి పునర్ వైభవాన్ని తెచ్చిందంటున్నారు నెటిజన్స్...

  ఇక థియేటర్ రన్ ఆల్ మోస్ట్ ముగియనుండడంతో ఈ సినిమా రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది లవ్ స్టోరి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది.

  Balakrishna | Akhanda : అందని ద్రాక్షగా మారిన బాలయ్య అఖండ.. కొత్త రిలీజ్ డేట్ అదేనా..

  ఇక లవ్ స్టొరీ చేసిన బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది.


  ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది. లవ్ స్టోరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా 28.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రెండో వారంలో 4.32 కోట్ల షేర్ అందుకుంది.

  Keerthy Suresh : నిమ్మ పండు రంగు చీరలో పిచ్చెక్కించిన కీర్తి సురేష్..

  ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి మూడు వారాల తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించి.. 2.5 కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది. నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత ఈ సినిమా రావడం, దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, మరోవైపు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచాయి.

  ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.
  Published by:Suresh Rachamalla
  First published: