LOVE STORY CLOSING WW COLLECTIONS AND NAGA CHAITANYA SAI PALLAVI SCORED CLEAN HIT AT TOUGH TIMES OF TOLLYWOOD PK
Love Story Closing WW Collections: ‘లవ్ స్టోరి’ క్లోజింగ్ కలెక్షన్స్.. క్లీన్ హిట్ కొట్టిన నాగ చైతన్య, సాయి పల్లవి..
లవ్ స్టోరి సినిమా ఫైనల్ డేస్ కలెక్షన్స్ (Love Story collections)
Love Story Closing WW Collections: తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఓ సినిమా భారీ లక్ష్యం చేధించి హిట్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చింది. కరోనా వచ్చి పోయిన తర్వాత ఓ సినిమా 20 కోట్లు వసూలు చేయడమే గగనంగా కనిపిస్తుంది. అలాంటిది 32 కోట్లు షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది లవ్ స్టోరీ సినిమా (Love Story Closing WW Collections).
తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఓ సినిమా భారీ లక్ష్యం చేధించి హిట్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చింది. కరోనా వచ్చి పోయిన తర్వాత ఓ సినిమా 20 కోట్లు వసూలు చేయడమే గగనంగా కనిపిస్తుంది. అలాంటిది 32 కోట్లు షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది లవ్ స్టోరీ సినిమా. హాలు నిండినది అనే బోర్డు చూసి కూడా చాలా నెలలు అయిపోతున్న తరుణంలో లవ్ స్టోరీ సినిమా మళ్లీ పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు అబౌ యావరేజ్ టాక్ వచ్చింది కానీ టాక్‌తో పని లేకుండా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైతూ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు. శేఖర్ కమ్ముల ఇమేజ్.. సాయి పల్లవి మ్యాజిక్ కలిపి లవ్ స్టోరి సినిమాకు మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. తాజాగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు ఆకట్టుకునే కలెక్షన్స్ వచ్చాయి. భారీ టార్గెట్ అందుకుని అంచనాలు నిలబెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల. మరి ఈ సినిమా ఏరియా వైజ్ ఫైనల్ కలెక్షన్స్ చూద్దాం..
వీకెండ్ వరకు అదిరిపోయే వసూళ్ళు తీసుకొచ్చిన ఈ చిత్రం వీక్ డేస్‌లోనూ పర్వాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా అక్టోబర్ 1న సాయి ధరమ్ తేజ్రిపబ్లిక్ సినిమా వచ్చిన తర్వాత కూడా రెండో వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకుంది లవ్ స్టోరి. చాలా ఏరియాల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఆంధ్రాలో మాత్రం ఒకట్రెండు ఏరియాల్లో స్వల్ప నష్టాలను తీసుకొచ్చింది లవ్ స్టోరి. 50 శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ షోస్ లేకపోవడం లవ్ స్టోరీకి మైనస్ అయింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.