Home /News /movies /

LOVE STORY 11 DAYS WW COLLECTIONS AND NAGA CHAITANYA SAI PALLAVI MOVIE REACHES BREAKEVEN MARK PK

Love Story 11 days WW Collections: ‘లవ్ స్టోరి’ 11 డేస్ కలెక్షన్స్.. భారీ లక్ష్యం చేధించిన నాగ చైతన్య, సాయి పల్లవి..

Naga Chaitanya Love Story Photo : Twitter

Naga Chaitanya Love Story Photo : Twitter

Love Story 11 days WW Collections: వీకెండ్ వరకు అదిరిపోయే వసూళ్ళు తీసుకొచ్చిన లవ్ స్టోరి చిత్రం (Love Story 11 days WW Collections) వీక్ డేస్‌లోనూ పర్వాలేదు అనిపించుకుంది. 11 రోజుల తర్వాత సినిమా అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ లాభాలు అందుకుంటుంది లవ్ స్టోరి సినిమా.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఓ సినిమా భారీ లక్ష్యం చేధించి హిట్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజుల్లో 20 కోట్లు వసూలు చేయడమే గగనంగా కనిపిస్తుంది. అలాంటిది 32 కోట్లు షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది లవ్ స్టోరీ సినిమా. హాలు నిండినది అనే బోర్డు చూసి కూడా చాలా నెలలు అయిపోతున్న తరుణంలో లవ్ స్టోరీ సినిమా మళ్లీ పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు అబౌ యావరేజ్ టాక్ వచ్చింది కానీ టాక్‌తో పని లేకుండా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైతూ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు. శేఖర్ కమ్ముల ఇమేజ్.. సాయి పల్లవి మ్యాజిక్ కలిపి లవ్ స్టోరి సినిమాకు మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. తొలి 11 రోజుల తర్వాత అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు ఆకట్టుకునే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా లవ్ స్టోరి 11 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చాయి. 32 కోట్ల వరకు షేర్ వసూలు చేయడంతో.. బ్రేక్ ఈవెన్ పూర్తైపోయింది. భారీ టార్గెట్ అందుకుని అంచనాలు నిలబెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల. 

‘లవ్ స్టోరీ’ 11 డేస్ కలెక్షన్స్..

నైజాం: 11.79 కోట్లు
సీడెడ్: 4.17 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.85 కోట్లు
ఈస్ట్: 1.56 కోట్లు
వెస్ట్: 1.31 కోట్లు
గుంటూరు: 1.47 కోట్లు
కృష్ణా: 1.33 కోట్లు
నెల్లూరు: 0.83 కోట్లు

ఏపీ + తెలంగాణ: 25.31 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.94 కోట్లు
ఓవర్సీస్: 4.92 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 32.12 కోట్ల షేర్

Jabardasth Faima: జబర్దస్త్‌లో ‘ఫలక్‌నుమా ఫైమా’ దెబ్బకు అంతా మటాష్.. సింగిల్ ఉమెన్ షో..


వీకెండ్ వరకు అదిరిపోయే వసూళ్ళు తీసుకొచ్చిన ఈ చిత్రం వీక్ డేస్‌లోనూ పర్వాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా అక్టోబర్ 1న సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా వచ్చిన తర్వాత కూడా రెండో వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకుంది లవ్ స్టోరి. చాలా ఏరియాల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు