హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం.. ఆదిపురుష్‌కు అగ్నిప్రమాదం.. ఒకే రోజు

Prabhas: సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం.. ఆదిపురుష్‌కు అగ్నిప్రమాదం.. ఒకే రోజు

సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం.. ఆదిపురుష్‌కు అగ్నిప్రమాదం.. ఒకే రోజు

సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం.. ఆదిపురుష్‌కు అగ్నిప్రమాదం.. ఒకే రోజు

Salaar unit road accident: గోదావరిఖని-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఓ యూటర్న్ వద్ద సలార్ యూనిట్ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవడంతో మమత ఆస్పత్రికి తరలించారు.

  ఇటు ఆది పురుష్.. అటు సలార్.. ప్రభాస్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు ఒకే రోజు ప్రమాదానికి గురయ్యాయి. ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే.. సలార్ యూనిట్ రోడ్డు ప్రమాదానికి గురయింది. పెద్దపల్లి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సలార్ మూవీ యూనిట్ సిబ్బంది గాయపడ్డారు. గోదావరిఖని-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఓ యూటర్న్ వద్ద సలార్ యూనిట్ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవడంతో మమత ఆస్పత్రికి తరలించారు. ఆందోళన అవసరం లేదని.. స్వల్ప గాయాలే అయ్యాయని యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సలార్‌ సినిమా గోదావరి ఖనిలో షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో బొగ్గు గనుల్లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. ప్రభాస్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ బైక్ మెకానిక్ షెడ్ బ్యాక్ డ్రాప్‌లో ప్ర‌భాస్‌-శృతిహాస‌న్‌పై వ‌చ్చే స‌న్నివేశాల‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.

  ‘కేజీయ‌ఫ్ ఛాప‌ర్ట్‌1’తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ కోసం అంద‌రినీ ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ‘సలార్’ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుంది. 'సలార్‌' అంటే సైన్యాధిపతి.. కింగ్‌ మేకర్‌ అనే అర్థం వస్తుందంటూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయాన్ని కేటాయించాడని టాక్‌ వినిపిస్తోంది.

  మరోవైపు ప్రభాష్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ షూటింగ్ కూడా ఇవాళే మొదలయింది. ముంబైలోని గోరెగాన్ స్టూడియోలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఐతే అక్కడా అపశృతి చోటుచేసుకుంది. ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోవడంతో పాటు భారీగానే ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే ప్రమాద సమయంలో హీరో హీరోయిన్లు ఎవరూ అక్కడ లేరు. కేవలం సెట్ పనులు మాత్రమే జరుగుతున్నట్లు తెలిసింది.

  'కాగా, ఆది పురుష్' చిత్రానికి ఓం రావుత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాతలు భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక, సాంఘిక, కల్పనాత్మక అంశాల కలబోతగా ఆది పురుష్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుంటే, రావ‌ణాసురుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఐతే ఒకే రోజు రెండు సినిమా యూనిట్లలో ప్రమాదం జరగడం అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐతే ఎలాంటి భారీ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Adipurush movie, Prabhas, Salaar, Tollywood

  ఉత్తమ కథలు