బాయ్ ఫ్రెండ్‌తో ఆఫ్రికా అందాలను ఆస్వాదిస్తోన్న కియారా...

Instagram/kiaraaliaadvani

Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

 • Share this:
  Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం.. హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో అక్షయ్ కుమార్‌తో నటిస్తోంది కియారా. తాజాగా ఈ భామ నటించిన గుడ్ న్యూజ్ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఊపు మీదున్న కియారా ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆఫ్రికా అందాలను ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే ఆఫ్రికా అందాలను హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ.. ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
  View this post on Instagram

  OMG! What a beautiful view 😍


  A post shared by Instant Bollywood (@instantbollywood) on

  ఆఫ్రికా అందాలను ఆస్వాదిస్తోన్న కియారా...
  Published by:Suresh Rachamalla
  First published: