Vivek Agnihotri : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. రీసెంట్‌గా ఈయన 90లలో కశ్మీర్ ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కామన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది.అంతేకాదు ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ది కాశ్మీర్ ఫైల్స్’ 90వ దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీతో తెరకెక్కించిన ఈ దర్శకుడికి బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేక ఆహ్వానం అందించింది. మరోవైపు దేశంలోని పలు యూనివర్సిటీలతో పాటు విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించాయి. రీసెంట్‌గా ఈయనకు లండన్‌కు చెందిన కేంబ్రిడ్జితో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు ఈయన్ని ఆహ్వానించారు. ఇక కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన ప్రసంగాన్ని రికార్డు చేయోద్దని ఆదేశించారు. నిజంగా ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషన్‌కు వ్యతిరకం అన్నారు. అక్కడ యూనివర్సిటీలో చాలా మంది పాకిస్థాన్‌కు చెందిన వాళ్లే స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. పాకిస్థాన్ మరియు కశ్మీర్‌కు చెందిన వాళ్లే తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదే యూనివర్సిటీలో సుభాష్ చంద్రబోస్ చదువుకున్నారు. ఆయన 150 జయంతి జరగకుండా ఆయన్ని ఫాసిస్టు అంటూ ఆయన జయంతోత్సవాలు జరగకుండా అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
Minister Roja - Alia Bhatt : మినిష్టర్ రోజాకు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్‌కు ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
కశ్మీర్ లో హిందువులపై జరిగిన దురాగతాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించడమే నేను చేసిన నేరమా అంటూ ఆక్రోషం వెళ్లగక్కారు. మన దేశంలో ప్రజల చేత ప్రజలచే ఎన్నుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉండటం వల్లే ఈ సినిమా తీయగలిగనన్నారు. అదే సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు నన్ను ఆహ్వానించారు. తీరా అక్కడి వెళితే.. మేము పొరపాటున ఒకరు బుక్ చేసిన డేట్‌లోనే మీ ప్రసంగానికి పొరపాటున అనుమతి ఇచ్చాము. మీకు జూలై 1న అపాయింట్ మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు ఆక్కడి యూనివర్సిటీ వాళ్లు. ఆ రోజున యూనివర్సిటీలో ఏ స్టూడెంట్ ఉండరు. విద్యార్థులు ఎవరు లేనపుడు నేను వచ్చ చేసేదేమి ఉంటుందన్నారు. కావాలనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు అక్కడున్న పాకిస్థానీ, కశ్మీర్ స్టూడెంట్స్ భయం వల్ల తనకు ఇచ్చిన అపాయింట్‌మెంట్ కావాలనే కాన్సిల్ చేసినట్టు చెప్పారు. వాళ్లు క్యాన్సిల్ చేసింది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అన్నట్లు చెప్పుకొచ్చారు. అక్కడున్న కశ్మీర్, పాకిస్థానీ స్టూడెంట్స్ ఇస్లామోఫోబియా వల్లే వాళ్లు తన ప్రసంగాన్ని ఆక్స్‌ఫర్డ్ వాళ్లు కాన్సిల్ చేసినట్టు చెప్పారు. వాళ్లు కాన్సిల్ చేసింది జెనోసైడ్‌తో పాటు హిందువులను అని చెప్పుకొచ్చారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో తనకు జరిగిన అవమానం ప్రతి ఒక్క భారతీయుడుదని ఆవేదన వెలిబుచ్చారు.
IMPORTANT:
Yet another Hindu voice is curbed at HINDUPHOBIC @OxfordUnion.
They have cancelled me. In reality, they cancelled Hindu Genocide & Hindu students who are a minority at Oxford Univ. The president elect is a Paksitani.
Pl share & support me in this most difficult fight. pic.twitter.com/4mGqwjNmoB
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022
రీసెంట్‌గా వికీపీడియా కూడా ఈయన తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా స్టోరీ కట్టుకథ అంటూ రాసుకొచ్చి తన అక్కసును వెళ్లగక్కిందని వివేక్ అగ్నిహోత్రి.. వికీపీడియా తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే కదా. వివేక్ అగ్నిహోత్రి.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీలో ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శించారు. అయితే ఎవరేమన్నా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక గతంలో తాష్కెంట్ ఫైల్స్ సినిమాను కూడా ఈయన తెరకెక్కిస్తే అది కూడా సంచలనం రేపింది. అంతే కాకుండా.. కేంద్రం అగ్నిహోత్రికి భద్రత కూడా కల్పించింది. త్వరలోనే ఢిల్లీలో షాహిన్ భాగ్‌లో CAA వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో ‘ఢిల్లీ ఫైల్స్’ సినిమాను తెరకెక్కించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, The Kashmir Files, Vivek Ranjan Agnihotri