LOK SABHA ELECTIONS 2019 WILL SUMALATHA AMBARISH DEFEAT KARNATAKA CM KUMARASWAMY SON NIKHIL GOWDA IN MANDYA LOK SABHA SEAT TA
‘మాండ్యా’ లోక్‌సభ స్థానంలో సీఎం కొడుకును సుమలత ఓడిస్తుందా.. ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయి..
సుమలత,నిఖిల్ గౌడ
సార్వత్రిక ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో వెంటనే వివిధ సంస్థలు ఏ పార్టీ అధికారంలో రాబోతున్నది ఎగ్జిట్ పోల్స్‌లో వివరించాయి. ఇక కర్ణాకట రాష్ట్రం విషయానికొస్తే..ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన స్థానం మాండ్యా. మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏమి చెబుతున్నాయి అంటే..
సార్వత్రిక ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో వెంటనే వివిధ సంస్థలు ఏ పార్టీ అధికారంలో రాబోతున్నది ఎగ్జిట్ పోల్స్‌లో వివరించాయి. ఇక కర్ణాకట రాష్ట్రం విషయానికొస్తే..ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన స్థానం మాండ్యా. ప్రముఖ నటుడు కాంగ్రెస్ నేత అంబరీష్ మరణంతో ఆయన భార్య సుమలత కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకుంది. కానీ కాంగ్రెస్ ఈ సీటు మిత్రపక్షం జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలత ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికల్లో నిలబడింది. సుమలతకు పోటీగా కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవగౌడ మనవడు.. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేయడంతో పోరు రసవత్తరంగా మారింది. వీళ్లిద్దరు కూడా ఈ ఎన్నికల్లోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొసమెరుపు. ఇక మాండ్యా లోక్‌సభ స్థానంపై వివిధ సంస్థలు వెల్లడించిన సర్వేలు కాంగ్రెస్,జేడీఎస్ శ్రేణులను నిద్రలేకుండా చేస్తున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ స్థానం నుంచి సుమలత గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి.
సుమలత రాజకీయాలు
ముఖ్యంగా బీజేపీ ఇక్కడ సుమలతకు పోటీగా అభ్యర్ధిని నిలబెట్టకపోవడం ఒకటైతే..ముఖ్యంగా యూత్,మహిళలు, మైనార్టీ వర్గాలకు చెందిన కొన్ని ఓట్లు సుమలతకు అనుకూలంగా పడ్డాయని పలు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. దీంతో మాండ్యా లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఫలితం ఎలా ఉండబోతుందో అని కర్ణాటక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు దాదాపు అన్ని మీడియాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా కర్ణాటకలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే అకవాశం ఉందని చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్,జేడీఎస్ కలిపి పోటీ చేసిన సింగిల్ డిజిట్ దాటవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో నిజంగానే జేడీఎస్ అభ్యర్ధి నిఖిల్ గౌడను ఓడించి సుమలత సంచలనం నమోదు చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.