LOK SABHA ELECTION RESULT 2019 MEGA BROTHER NAGABABU ONLY FIXED ON JABARDASTH COMEDY SHOW AFTER ELECTION RESULT TA
Lok Sabha Election Result 2019: నాగబాబు ఇక జబర్ధస్త్ షోకే పరిమితమా..
నటుడు నాగబాబు (ఫైల్ ఫోటో)
ఏపీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు? ఫలితాలు వెలుబడే వరకు హాట్ హాట్‌గా చర్చలు జరిగాయి. తీరా ఫలితాలు మాత్రం జనసేనతో పాటు నాగబాబుకు తీవ్ర నిరాశకు గురిచేసాయి.
ఏపీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు? ఫలితాలు వెలుబడే వరకు హాట్ హాట్‌గా చర్చలు జరిగాయి. కానీ ఫలితాలు వెలుబడిన తర్వాత ప్రజల్లో జనసేన పార్టీపై ఎలాంటి ఎఫెక్ట్ లేదనే విషయం అర్థమవుతోంది. ఇక జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నాగబాబు.. కనీస ప్రభావం చూపించలేకపోయాడు. ఇక ఎన్నికల తర్వాత నర్సాపురంలో గెలిచినా.. గెలవక పోయిన నర్సాపురం ప్రజలకే సేవ చేస్తానని ప్రకటించాడు. తీరా ఫలితాలు చూసిన తర్వాత నాగబాబు పరాజయం జనసేన శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసాయి.ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత నాగబాడు తిరిగి సినిమాలు, జబర్ధస్త్ కామెడీ షోకే పరిమిత అవుతారా అని ఆయన సన్ని హిత వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినపుడు..ఏదో 18 సీట్లు వచ్చాయి. అదే పవన్ కళ్యాణ్ విషయానికొస్తే..2 సీట్లకు పరిమితమైంది. ఏమైనా ఈ ఫలితాలు మెగాభిమానులతో పాటు నాగబాబు తీవ్ర నిరాశకు గురిచేసాయి. అందుకే తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన జబర్ధస్త్ షో కే నాగబాబు పరిమితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.