Lok Sabha Election 2019 Results: లోకసభ ఎన్నికల ఫలితాలు.. ఓడిన గెలిచిన ప్రముఖులు..

2019 సార్వత్రిక ఎన్నికల్లో పలువరు సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొందరు గెలిచి..పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు తీవ్ర నిరాశకు గురిచేసాయి.

news18-telugu
Updated: May 23, 2019, 7:36 PM IST
Lok Sabha Election 2019 Results: లోకసభ ఎన్నికల ఫలితాలు.. ఓడిన గెలిచిన ప్రముఖులు..
ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటులు
  • Share this:
2019 సార్వత్రిక ఎన్నికల్లో పలువరు సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొందరు గెలిచి..పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు తీవ్ర నిరాశకు గురిచేసాయి. ముఖ్యంగా 17వ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని మథుర లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు హేమామాలిని. మరోవైపు ఆయన సవతి కొడుకు సన్ని డియోల్.. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంట్‌ గడపతొక్కబోతున్నాడు. మరోవైపు యూపీ ముఖ్యమంత్రి సొంత లోక్‌సభ స్థానం గోరఖ్ పూర్ నుంచి రేసుగుర్రం విలన్ రవి కిషన్ శుక్లా గెలిచారు. మరోవైపు చండీఘడ్‌ నుంచి కిరణ్ ఖేర్ మరోసారి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టబోతుంది. పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ నుంచి బెంగాలి నటుడు.. బాబుల్ సుప్రియో . . తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన సినీ నటుడు మూన్ మూన్ సేన్ పై  1 లక్షా 97వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు తృణముల్ కాంగ్రెస్ నుంచి బసిర్ ఘాట్ నుంచి నుస్రత్ జహాన్..బీర్‌బర్ నుంచి శతాబ్ధి రాయ్..జాదవ్ పూర్ నుంచి మిమి చక్రబర్తి మరోసారి గెలిచారు. కర్ణాటకలో మాండ్యా లోక్‌సభ స్థానంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సుమలత..తన సమీప ప్రత్యర్ధి సినీ నటుడు నిఖిల్ గౌడపై సంచలన విజయం సాధించారు.

Lok Sabha Election 2019 Result: Result of Bollywood Celebrities who winning, losing their lok sabha Elections,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,Sunny deol gurdaspur,hema malini mathura,hema malini,sunny deol,Bollywood,urmila matondkar,Kirron Kher- BJP,Babul Supriyo,Shatrughan Sinha,jaya prada,sumalatha ambarish,prakash raj,సన్ని డియోల్,హేమా మాలిని,హేమా మాలిని మథుర,సన్ని డియోల్ గురుదాస్‌పూర్,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు,ప్రకాష్ రాజ్,సుమలత అంబరీష్,శతృఘ్న సిన్హా,ఊర్మిళ,బాబుల్ సుప్రియో,
ఊర్మిళ,శతృఘ్న సిన్హా,సన్ని డియోల్,రవికిషన్ శుక్లా


ఓడిపోయిన వాళ్ల విషయానికొస్తే..రామ్ పూర్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన జయప్రద..తన సమీప ప్రత్యర్ధి ఆజాంఖాన్‌పై ఓడిపోయారు. అటు బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్..కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మరోవైపు ముంబాయి నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఊర్మిళ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అటు సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శతృఘ్న సిన్హా పాట్నా సాహిబ్‌లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి రవిశంకర్ ప్రసాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. మరోవైపు లక్నోలో పోటీ చేసిన శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా కూడా ఈ ఎన్నికల్లో కనీసం పోటీలో లేకపోయింది. ఇక ఈ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీతో ఏదో మ్యాజిక్ చేస్తాడనుకున్న కమల్ హాసన్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అటు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజవర్గాల్లో ఓడిపోయారు.మరోవైపు జనసేనాని అన్నయ్య నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు వైసీపీ తరుపున నగరి నుంచి పోటీ చేసిన రోజా..రెండు వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక అనంతపురం జిల్లా అన్నిస్థానాల్లో వైసీపీ గాలి వీచినా.. హిందూపూర్‌లో మాత్రం బాలకృష్ణ తన పట్టు నిలుపుకొని టీడీపీ తరుపున ఒక్కమగాడుగా నిలిచాడు. మొత్తానికి ఈ ఎన్నికలు కొంత మంది నటులకు ఖేదాన్ని మిగిలిస్తే.. మరికొందరికి మోదాన్ని కలిగించాయి.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...