Home /News /movies /

TV serials: కరోనా టైంలో సీరియల్ ప్రేక్షకులకు షాక్.. ఆ సీరియల్స్ అన్నీ ఆగిపోతున్నాయా?

TV serials: కరోనా టైంలో సీరియల్ ప్రేక్షకులకు షాక్.. ఆ సీరియల్స్ అన్నీ ఆగిపోతున్నాయా?

tv serials

tv serials

TV serials:  కరోనా దెబ్బకి ప్రతి ఒక సెక్టారు అతలాకుతలం అయిపోతోంది. భారతదేశంలో అత్యధిక కేసులు నమోదు కావడం, మరణాల రేటు కూడా అలాగే ఉండడంతో

    TV serials:  కరోనా దెబ్బకి ప్రతి ఒక సెక్టారు అతలాకుతలం అయిపోతోంది. భారతదేశంలో అత్యధిక కేసులు నమోదు కావడం, మరణాల రేటు కూడా అలాగే ఉండడంతో దాదాపు అందరూ ప్రస్తుతం ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్ దెబ్బ యొక్క ప్రభావం ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీ పైన పడింది.

    టీవీలో వచ్చే సీరియల్స్ కి షూటింగ్ ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. అయితే ఈ లాక్ డౌన్ పరిమితుల వల్ల షూటింగ్ లొకేషన్స్ గోవా వంటి ప్రదేశాలకు మారుతున్నప్పటికీ ఎంతోమంది నిర్మాతలకి ఇది భారంగా మారింది. టెలివిజన్ కంటెంట్ అనేది రోజూ ప్రసారం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం నిరంతరాయంగా షూటింగ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణలో భాగంగా తక్కువ రేటింగ్ వస్తున్న షోలు అన్నింటిని నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు.

    రాష్ట్రాలు దాటి ఇతర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సీరియల్స్ లో కొన్ని హమారీ వాలీ గుడ్ న్యూస్, కుండలి భాగ్య, కుంకుమ బాగ్యా, ఖుర్బాన్ హువా వంటి సీరియల్ లు ఉన్నాయి. 'షాదీ ముబారక్' అనే సీరియల్ ను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. తారక్ మెహతా 'ఉల్టా చస్త్మా' అనే పాపులర్ షో కి మే మొదటి అర్ధభాగం వరకు ప్రసారం చేసేందుకు ఎపిసోడ్ లు ఉన్నాయి. అయితే ఆ తర్వాత వాటిని కొనసాగించే పరిస్థితి అయితే లేకుండా పోయింది.

    ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ జెడి మజేథియా మాట్లాడుతూ కొన్ని షోలను పూర్తిగా నిలిపివేసే యోచనలో వారు ఉన్నట్లు కన్ ఫర్మ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు మే రెండో తారీకు వరకు ఉన్నాయి కాబట్టి ముంబై లో షూటింగ్ కనుక ఆ తర్వాత కొనసాగితే ఎక్కువ షోలు ఆగిపోయే పరిస్థితి లేదు కానీ లాక్ డౌన్ కొనసాగించే మాత్రం ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయిన షో లను రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మొత్తానికి ఈ సీరియల్స్ భవిష్యత్తు ప్రభుత్వాలు లాక్ డౌన్ పై తీసుకునే నిర్ణయాల పై ఆధారపడి ఉంది అని మాత్రం క్లియర్ గా అర్ధం అవుతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Lockdown impact, Low ratings, Telugu tv serials, Tv serials, TV shows

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు