యంగ్ పొలిటీషియన్‌తో ఎఫైర్ నడుపుతోన్న వరుణ్ తేజ్ భామ..?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' మూవీలో వరుణ్ తేజ్ పక్కన అందాలతో అదరగొట్టన దిశా పటానీ ఓ యువ రాజకీయ నాయకుడుతో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

news18-telugu
Updated: June 14, 2019, 1:08 PM IST
యంగ్ పొలిటీషియన్‌తో ఎఫైర్ నడుపుతోన్న వరుణ్ తేజ్ భామ..?
దిశా పటాని Photo: Instagram.com/dishapatani
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' మూవీ గుర్తుందా? ఆ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన అందాలతో అదరగొట్టన దిశాపటానీ ఓ యువ రాజకీయ నాయకుడుతో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..తెలుగులో లోఫర్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని..అయితే ఆ చిత్రం అనుకున్నంతగా బాక్సాఫీస్ దగ్గర అలరించకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో హిందీ చిత్ర సీమపై కన్నేసిన ఈ భామ..ఆ దిశగా అడుగులు వేసి..ప్రస్తుతం అక్కడ భాగానే రాణిస్తోంది. అంతేకాకుండా దిశా పటాని ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అదరగొడుతూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి తోడు ఆమె హిందీ నటుడు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమ వ్యవహారం కూడ ఈ భామను ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేలా చేస్తోంది. అయితే వీరు మాత్రం తాము స్నేహితులం మాత్రమే అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. అది అలా ఉంటే.. తాజాగా దిశా పటాని ఓ యంగ్ పొలిటీషియన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 

View this post on Instagram
 

#dishapatani with #adityathackeray snapped for dinner in juhu #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on

ఇటీవల దిశా పటాని, బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రే‌తో కలసి డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ వార్తలకు బలం చేకూరేలా వారి డిన్నర్ డేట్‌కు సంబందించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దిశా పటాని, టైగర్ ష్రాఫ్ జంట విడిపోయారంటూ హిందీ ఇండస్ట్రీలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా దిశా పటాని స్పందిస్తూ.. నాకు ఆదిత్య మంచి స్నేహితుడిని..అంతే తప్ప..మా మధ్య ఇంకేమి లేదని స్పష్టం చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. నాపై ఇలాంటీ రూమర్స్ చేసే వారి గురించి నేను పట్టించుకోనని పేర్కోంది. దిశా పటాని ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'భారత్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు