Like Share and Subscibe: యంగ్ టాలెంట్ సంతోష్ శోభన్ (Santosh Shobhan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ (Like Share And Subscibe) గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. వైవిధ్యమైన ప్రచారంతో ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు హీరో సంతోష్ శోభన్. దసరా పండుగ టైమ్ లో రిలీజ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ నుంచి ఈ సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. సంతోష్ లో తనను తాను చూసుకుంటానని నాని చెప్పడం ఆయన గొప్పదనం కాగా ఈ యంగ్ హీరోలోని టాలెంట్ కు ఈ కామెంట్స్ ఒక ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. సునైనతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ, నిఖిల ఫన్ ఇంటర్వ్యూ సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి.
ఇక తాజాగా మా సినిమా మీకు తెలుసా అంటూ నేరుగా ప్రేక్షకుల దగ్గరకే వెళ్లి సినిమా వాళ్లలో ఎంత క్యూరియాసిటీ తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు హీరో సంతోష్ శోభన్. కొందరు సినిమా రిలీజ్ గురించే తెలియదు అనడం, సంతోష్ శోభన్ ను గుర్తుపట్టకపోవడం వంటిని ఈ వీడియోలో ఫన్ తీసుకొచ్చాయి.
Young hero @santoshshobhan unique promotion for his film #LikeShareSubscribe ???? Releasing on Nov 4thhttps://t.co/UUWXLLWapZ
— Suresh Kondi (@SureshKondi_) November 1, 2022
దీన్ని ట్రోల్ వీడియోలా మార్చి రిలీజ్ చేశారు. గొప్ప సినిమాను తెరకెక్కించడమే కాదు దాన్ని అంతే గొప్పగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చూడటం ముఖ్యం. నటించాను నా పని పూర్తయింది అనుకోకుండా సొంత ప్రాజెక్ట్ లా అందులో చాలా ఇన్వాల్వ్ అయి ప్రమోషన్ చేస్తున్న సంతోష్ శోభన్ ను పలువురు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ వీడియోలకు పాజిటివ్ కామెంట్స్ వస్తుండటంపై టీమ్ హ్యాపీగా ఉంది.
ఈ సినిమాను ఈ నెల 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సంతోష్ శోభన్ గత కొన్నేళ్లుగా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి హీరోల్లా కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అలరిస్తున్నాడు. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ కాకుండా.. ఓటీటీ వేదికగా ఈయన అదరగొట్టేస్తున్నాడు. మరి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తోన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీతో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood