LIGER VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER MOVIE ANOTHER CRAZY UPDATE TA
Liger - Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్..
విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ (Instagram/Photo)
Liger - Vijay Devarakonda : డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ మూవీ నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు.
Liger - Vijay Devarakonda : డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్.
సునీల్ శెట్టి (Sunil Shetty) ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను కాసేటి క్రితమే విడుదల చేసారు.
తాజాగా ‘లైగర్’ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 31న ఉదయం 10.03 నిమిషాలకు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఓ వీడియోను విడుదల చేశారు. డిసెంబర్ 30న ఉదయం 10.03 నిమిషాలకు BTS Stills Release చేయనున్నట్టు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం.. 4.00 గంటలకు SPL Insta Filter రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను 2017లో అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ రోజున ఆగష్టు 25న రిలీజ్ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.
హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. అందులో ‘పుష్ప’ మొదటి భాగం ది రైజింగ్ డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లనే రాబడుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.