Liger - Vijay Devarakonda: లైగర్ నిర్మాణంలో అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తు..
లైగర్ మూవీలో బ్లాక్ మనీ పెట్టుబడులపై ఈడీ (ED Enforcement Directorate) దర్యాప్తు కొనసాగుతోంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో (Pan India) లెవల్లో విడుదలైన ఈ మూవీకి నిర్మాతలు రూ. 125 కోట్ల రూపాయల భారీ ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ 160 బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేస్తోంది.పూరీ కనెక్ట్ ఎల్ ఎల్ పీ ద్వారా తెలంగాణకు చెందిన ఓ రాజకీయ నాయకుడు రూ.30 నుంచి రూ.40 కోట్లు ఈ సినిమా నిర్మాణానికి పెట్టినట్లు ఈడీ గుర్తించింది. రాజకీయ నాయకులు వారి బినామీల ద్వారా సినిమాకు నిధులు సమకూర్చినట్లు సమాచారం. పూరీ కనెక్ట్స్ ఎల్ ఎల్ పి ఫెడరల్ ఏజెన్సీ లైగర్ నిర్మాతలకు, తెలంగాణలోని ఓ రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న సంబంధాన్ని వెలికితీసింది.
పూరి కనెక్ట్స్ LLP అనేది 2016లో స్థాపించిన, భాగస్వామ్య సంస్థ. జూబ్లీహిల్స్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. దీనిని పెట్ల జగన్నాధ్, సురదీప్ కౌర్ దీప్‌సింగ్ స్థాపించారు. ఇప్పటికే నవంబర్ 30న ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పారితోషికం గురించి హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. సినిమాకు ఎంత ఖర్చయింది తేల్చేందుకు ప్రముఖుల పారితోషకాల గురించి ఈడీ విచారణ చేపట్టింది.
అక్రమాలు నిగ్గు తేలుస్తారానాపై ఎలాంటి ఆరోపణలు లేవని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అధికారులు కొన్ని వివరణలు కోరారు. నేను అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ED ముందు హాజరుకావడం ద్వారా నా బాధ్యతను నిర్వర్తించానని విజయ్ దేవరకొండ చెప్పారు. లైగర్ విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత, దర్శకుడు, సహ నిర్మాత పూరీ జగన్నాధ్ , నటిగా మారిన సహ నిర్మాత ఛార్మి కౌర్‌ను ED విచారణ కోసం పిలిపించింది. ఆయన ఫిర్యాదు మేరకు బక్కా జడ్సన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఫెడరల్ ఏజెన్సీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద విచారణ ప్రారంభించింది.
కాంగ్రెస్ నాయకుడు జడ్సన్ లైగర్ లో పెట్టుబడులు అక్రమ మార్గాల్లో వచ్చాయని ఆరోపించారు. చాలా మంది రాజకీయ నాయకులు షాడో నిర్మాతలుగా డబ్బు పెట్టుబడి పెట్టారని ఆయన ఆరోపించారు. నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి, పన్ను ఎగవేసేందుకు ఇదే సులభమైన మార్గంగా వారు భావించారని జడ్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫెమాను ఉల్లంఘించి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులపై గతంలో పూరీ జగన్నాధ్, నటిగా మారిన సహ నిర్మాత ఛార్మి కౌర్‌లను ఈడీ ప్రశ్నించింది. ఈ చిత్రంలో అమెరికా మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటించారు. లాస్ వెగాస్‌లో సాంకేతిక బృందం ఈ చిత్రాన్ని చిత్రీకరించింది. మైక్ టైసన్‌కు చెల్లించిన డబ్బుపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. మరి ఈ దర్యాప్తు ముందు ముందు తెలంగాణ, ఏపీలో ఏయే రాజకీయ నాయకుల భవిత్యం ఎలా ఉంటుందనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda