Home /News /movies /

LIGER TEASER TALK VIJAY DEVARAKONDA PURI JAGANNADH GLIMSE OF LIGER RELEASED TA

Liger First Glimpse Talk : విజయ్ దేవరకొండ ‘లైగర్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టాక్.. ప్రధాని మోదీని ఆ విధంగా వాడుకున్న పూరీ జగన్నాథ్..

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

Liger - Vijay Devarakonda : డాషింగ్ డైరెక్టర్   ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh)దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

    Vijay Devarakonda  - Liger First Glimpse Talk  : డాషింగ్ డైరెక్టర్   ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh)దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.

    ఈ సినిమాకు సంబంధించిన వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ.. బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం మన దేశం నుంచి అమెరికాకు వెళతారు. అక్కడ అతని ఇంట్రడ్యూస్ చేస్తారు. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా కనిపిస్తోంది. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ.


    ఈ సినిమా టీజర్‌లో విజయ్ దేవరకొండను ఊర మాస్ లెవల్లో చూపించారు పూరీ జగన్నాథ్. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్‌కు పూరీ జగన్నాథ్ సాలిడ్ హిట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో  సునీల్ శెట్టి (Sunil Shetty) ఈ డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం.

    Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకు అదిరిన టీఆర్‌పీ రేటింగ్.. గతంలో కంటే..

    ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

    Year Ender 2021 : ఈ యేడాది టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు..


    హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. అందులో ‘పుష్ప’ మొదటి భాగం ది రైజింగ్ డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లనే రాబడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: PM Narendra Modi, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు