Balakrishna - Vijay Devarakonda - Liger - Puri Jagannadh : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ ‘లైగర్’లో అదిరిపోయే పాత్రలో బాలకృష్ణ చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ మధ్య కాలంలో నందమూరి నట సింహాం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి అందరినీ ఆశ్యర్యపోయేలా చేసారు. అన్‌స్టాపబుల్ విత్ NBK’ అంటూ చేసిన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు మంచు మోహన్ బాబును తీసుకొచ్చారు. ఈ ఎపిపోడ్‌కు అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు తొలి ఎపిసోడ్‌తోనే బాలయ్య.. యాంకర్‌గా అదరగొట్టారనే పేరు తెచ్చుకున్నారు. దీంతో రాబోయే నాని ఎపిసోడ్ ఎలా ఉంటుందనే ఆసక్తి సామాన్య ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా బాలయ్య.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘లైగర్’లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.
రీసెంట్గా గోవాలో జరిగిన ఈ సినిమా షూటింగ్లో ఈ సినిమా యూనిట్‌ను బాలయ్య సడెన్ విజిట్ ఇచ్చి ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమాకు అది బోనస్ అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాలయ్య ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవలో ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు.
గతంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్ వంటి హీరోలు వేరే హీరోలకు యానిమేటేడ్ సినిమాలకు డబ్బింగ్‌తో పాటు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ కోవలో ఇపుడు బాలయ్య కూడా మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో పాటు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కోసం పూరీ జగన్నాథ్ అండ్ టీమ్ ఈ నెల 12న అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడే క్లైమాక్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
విడాకుల తర్వాత సమంతకు అరుదైన గౌరవం.. దక్షిణాదిన ఆ ఘనత అందకున్న తొలి హీరోయిన్గా రికార్డు..
‘లైగర్’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.
Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..
హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మరోవైపు బాలయ్య నటించిన ‘అఖండ’ మూవీ వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు త్వరలో పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా కూడా చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ananya Panday, Balakrishna, Bollywood news, Charmme kaur, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda