ఆగ్ లగా దేంగే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). తన లైగర్ (Liger) సినిమాలోని ఈ మాస్ డైలాగ్ దేశవ్యాప్తంగా జనాన్ని అట్రాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ విషయమై ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటోంది లైగర్ టీమ్. దీంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ పరిస్థితుల నడుమ బాలయ్య బాబుతో (Nandamuri Balakrishna) ముచ్చట్లాడిన ఓ వీడియో షేర్ చేసి నందమూరి అభిమానులకు కూడా గాలం వేశారు విజయ్ దేవరకొండ.
లైగర్ సినిమా షూటింగ్ సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ తమను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ బాలయ్య సర్ లవ్ అంటూ నందమూరి అభిమానులను హూషారెత్తించారు. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న స్ట్రాంగ్ మ్యూజిక్, ఆగ్ లగా దేంగే అనే డైలాగ్ మరింత రక్తి కట్టిస్తోంది. బాలయ్య బాబు, విజయ్ దేవరకొండలను ఇలా చూసి మురిసిపోతున్నారు ఇరువురి ఫ్యాన్స్. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.
చిత్ర ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టిన లైగర్ టీమ్.. చివరి క్షణం వరకు వదిలేదే లేదని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇటు విజయ్ దేవరకొండ, అనన్య పాండే దేశం మొత్తం చుట్టేస్తూ లైగర్ ట్రెండ్ క్రియేట్ చేస్తుండగా.. అటు పూరి జగన్నాథ్, ఛార్మి తమదైన స్టైల్ లో లైగర్‌పై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నారు. దీంతో ఇక సినిమా రిలీజ్ టైం దగ్గరకొస్తున్న కొద్దీ ఆతృత రెట్టింపవుతోంది.
Balayya sir is love ❤️
When he came to see us on sets.#Liger pic.twitter.com/jZw2Cbaz9D
— Vijay Deverakonda (@TheDeverakonda) August 24, 2022
విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన లైగర్ అప్డేట్స్ ఈ మూవీ రేంజ్ ఏంటనేది చెప్పేశాయి. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కావడం విశేషం. విజయ్ దేవరకొండ- మైక్ టైసన్ నడుమ షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు పూనకాలు తెప్పించనున్నాయట. ఈ సినిమాకు UA సర్టిఫికెట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు సభ్యులు. ఆగస్టు 25 వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakirshna, Liger, Vijay Devarakonda